Kangana Ranaut:పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ.. ఇందులో నిజమెంత?

బాలీవుడ్ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్( kangana ranaut ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కంగానా ఏ విషయాని అయిన నిస్సంకోచంగా ఆ ముఖం మీదే మాట్లాడేస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే.

 Kangana Ranaut Finally Getting Married Wedding Invites Video Viral-TeluguStop.com

అప్పుడప్పుడు లేనిపోని కాంట్రవర్సీలను ( kangana ranaut in Controversies )కొని తెచ్చుకుంటూ ఉంటుంది.అందుకే ఆమెను అభిమానులు ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు.

కంగనా నిత్యం ఏదో ఒక వివాదంతో తరచుగా సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు అయితే తనకు సంబంధం లేని విషయాలలో కూడా ఆమె కలుగజేసుకుని మరి విషయాలపై స్పందించి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ కి కూడా గురి అవుతూ ఉంటుంది.

అలాగే సమాజంలో జరిగే పలు విషయాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది కంగానా.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కంగానా ఎమర్జెన్సీ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది.కాగా తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియో చూస్తే కంగనా పెళ్లి( kangana ranaut marriage ) చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.కారులో వచ్చిన కంగనాను మీడియా ప్రతినిధులంతా చుట్టుముట్టి ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు వేశారు.

దీంతో వెంటనే స్పందించిన కంగనా వెడ్డింగ్ కార్డు చూపిస్తూ వారికి శుభవార్త చెప్పింది.మీరందరూ కూడా పెళ్లికి హాజరు కావాలని వారిని ఆహ్వానించింది.అయితే వెడ్డింగ్ కార్డులో ఆమె పేరు లేకపోవడంతో వారంతా షాక్‌ తిన్నారు.దీంతో కంగనా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు జోరుగా వినిపిస్తునాయి.కాగా ఇదంతా కంగనా నిర్మిస్తున్నా చిత్రం టిక్కు అండ్ షేరు సినిమా మూవీ ప్రమోషనన్స్ లో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది.రిలీజ్ చేయనున్నారు.అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది.

https://www.instagram.com/reel/CtbHx2nAtsC/?utm_source=ig_web_copy_link
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube