15ఏళ్ల బాలిక బాధ్యతతో Save soil అంటూ 5వేల కిలోమీటర్ల పైగా సైకిల్ యాత్ర చేస్తోంది తెలుసా మీకు?

15ఏళ్ల యువతి ఎవరూ చేయని ఓ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ప్రకృతిని పరిరక్షించే భాగంలో ఎవరికోసమో ఎదురు చూడకుండా, స్వనిర్ణయం తీసుకొని రాబోయే కాలంలో రాబోతున్న ఓ విపత్తుని వెలుగెత్తి చాటుతుతోంది.అవును… భవిష్యత్తులో ఆహార కొరత ఏవిధంగా ఉంటుందో గుర్తించిన ఆ బాలిక అలుపెరుగని సాహాసం చేస్తోంది.ఈ క్రమంలో ‘సేవ్‌ సాయిల్‌’ నినాదంతో సైకిల్‌ యాత్ర చేపట్టింది.

 Kamareddy Girl Vennela 5k Kms Cycle Yatra To Save Soil Campaign-TeluguStop.com

ఆమె పేరు వెన్నెల.సేవ్ సాయిల్ నినాదంతో 5 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర కొనసాగిస్తోంది.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నుంచీ 21 రోజులుగా 5000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తోంది.

వివరాల్లోకి వెళితే, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామానికి చెందిన వెన్నెల అనే అమ్మాయి ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసింది.

రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడం వలన భూసారం తగ్గిపోతున్న క్రమంలో ప్రజలలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టానని చెబుతోంది వెన్నెల.NTR జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వెన్నెలను విజయవాడలో కలెక్టర్ క్యాంపు ఆఫీసులో రిసీవ్ చేసుకున్నారు.

పాలసీ మేకర్స్, వ్యవసాయంపై అవగాహన ఉన్న వారు చేయాల్సిన పని చిన్నపిల్ల చేయడాన్ని ఆయన అభినందించారు‌.

Telugu Kms Cycle Yatra, Thousandkilo, Kama, Save Soil, Somarampeta, Telangana, V

వెన్నెలకు తన వంతుగా 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు కలెక్టర్ ఢిల్లీరావు.జగ్గీ వాసుదేవ్ వల్ల ప్రభావితం అయ్యి ఇలా యాత్ర చేస్తున్నానని వెన్నెల చెప్పడం హర్షణీయం.బీద కుటుంబం నుంచీ వచ్చిన తను 2 తెలుగు రాష్ట్రాల రైతులను కలిసి భూసారం పెంచాలనే విషయంపై అవగాహన కల్పిస్తానంటోంది.

రాబోయే తరాలను రక్షించాలని లక్ష్యంతోనే తాను ఈ యాత్ర చేపట్టానని తెలిపింది.ప్రభుత్వాలు సేవ్ సాయిల్ పై ఒక పాలసీ తీసుకురావాలంటోంది వెన్నెల.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube