బిజెపి కి నో ఎంట్రీ అంటున్న కమలహాసన్ ?

మొదటినుంచి ఉత్తరాది రాజకీయ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకే తమిళ ప్రజలు పట్టం కడుతూ ఉంటారు.అయితే డిఎంకె లేదా అన్నా డీఎంకే( DMK ) కి మధ్య తమిళనాడు లో రాజకీయం తిరిగింది .

 Kamala Haasan Saying No Entry To Bjp In Tamil Nadu , Dmk, Tamil Nadu , Bjp, Kama-TeluguStop.com

అయితే అనారోగ్య కారణాలతో జయలలిత( Jayalalithaa ), వయోభారంతో కరుణానిధి మరణించడంతో డిఎంకె వార సత్వాన్ని స్టాలిన్ నిలుపుకోగా అన్నాడిఎంకె మాత్రం వారసుల మధ్య ముక్కలైంది.దాంతో ఈ శూన్యత లో తమ కు అవకాశం దొరుకుతుంది అని బావించిన భాజపా ఆ రాష్ట్రం లో గట్టిగానే ప్రయత్నిస్తుంది.

మెజారిటీ హిందువులను ఆకట్టుకునే దిశగా అనేక ప్రయత్నాలు చేస్తూ పొలిటికల్ స్పేస్ కోసం ప్రయత్నిస్తుంది.

Telugu Jayalalithaa, Kamala Haasan, Kamalahaasan, Rahul Gandhi, Tamil Nadu-Telug

అయితే మత విద్వాషాలు రేచ్చ కొట్టే భాజపాకు ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో ( Tamil Nadu )స్థానం లేదంటూ మక్కల్ కయ్యం నీది పార్టీ అధ్యక్షుడు,ప్రముఖ నటుడు , బహుముఖ ప్రజ్ఞాశాలి కమలహాసన్( Kamala Haasan ) తమ పార్టీ వచ్చే ఎన్నికలలో డిఎంకె నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు .వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్న కమలహాసన్ తన పార్టీ 2024 ఎన్నికల్లో ఇండియా కూటమికి మిత్రపక్షంగా పోటీ చేస్తుందని ప్రకటించారు.ఇప్పటికే సీట్ల సర్దుబాటు గురించి ప్రాథమిక చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది .మునుపటి ఎన్నికల్లో 39 ఎంపీ స్థానాలకు 38 స్థానాలు గెలుచుకున్న యూపీఏ కూటమి ఈసారి ఇండియా గా రూపాంతరం చెందింది.

Telugu Jayalalithaa, Kamala Haasan, Kamalahaasan, Rahul Gandhi, Tamil Nadu-Telug

ఒక ఎంపీ స్థానాన్ని10 ఎమ్మెల్యే స్థానాలను కమల్ పార్టీకి ఎన్డీఏ కూటమి ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ( Rahul Gandhi ) భారత్ జూడో యాత్రకు మద్దతు తెలిపిన కమలహాసన్ ఆ తర్వాత అనేక సందర్భాల్లో అధికార భాజాపాను తీవ్రంగా దుయ్యబట్టారు.రాజకీయ అధికారి కోసం ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతుంది అంటూ ఆయన ఆరోపించారు.

దాంతో వచ్చే ఎన్నికల్లో భాజాపాక ఆధిక్యం దక్కనీయకూడదు అన్న పట్టుదలతోనే ఆయన ఇండియా కూటమికి మద్దతు ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube