సూపర్‌ హిట్‌ 'విక్రమ్‌' సినిమాకు ఇంత దారుణమైన అవమానం ఏంటో?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఏకంగా 400 కోట్ల రూపాయల వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రాబట్టింది అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

 Kamal Hassan Vikram Movie Star Maa Tv Trp Rating , Film News, Kamal Hassan, Star Maa Tv, Telugu News, Vikram Movie-TeluguStop.com

తమిళం లో భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమాల యొక్క రికార్డులను విక్రమ్ సినిమా బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్న విక్రమ్ సినిమా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బుల్లి తెర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

తెలుగు లో కూడా ఈ సినిమా ను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా టెలికాస్ట్ చేయడం జరిగింది.

 Kamal Hassan Vikram Movie Star Maa Tv Trp Rating , Film News, Kamal Hassan, Star Maa Tv, Telugu News, Vikram Movie-సూపర్‌ హిట్‌ విక్రమ్‌#8217; సినిమాకు ఇంత దారుణమైన అవమానం ఏంటో-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Kamal Hassan, Maa Tv, Telugu, Vikram-Latest News - Telugu

వందల కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా కచ్చితంగా రేటింగ్ విషయం లో బుల్లి తెర సెన్సేషన్ అన్నట్లుగా నిలుస్తుందని అంతా భావించారు, అందుకే ఈ సినిమా ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.కానీ అనూహ్యంగా ఈ సినిమా కు కేవలం 5.1 రేటింగ్ మాత్రమే వచ్చింది.ఈ రేటింగ్ చూసి కమల్ హాసన్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.ఇక చానల్‌ నిర్వాహకులు కూడా నోరెళ్ల పెట్టారు.కమలహాసన్ సినిమా అవడం వల్లే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కూడా అతి తక్కువ రేటింగ్ దక్కింది అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.ఎక్కువ శాతం మంది థియేటర్లోనే సినిమా చూడటం వల్ల టీవీల్లో చూసేందుకు ఆసక్తి కనబడలేదు అంటున్నారు.

అదే సమయం లో మరో ఛానల్ మంచి సినిమా రావడం వల్ల విక్రమ్ సినిమా కి రేటింగ్ తగ్గిందని కొందరు విశ్లేషిస్తున్నారు.మొత్తానికి కమల్ హాసన్ కి ఖచ్చితం గా ఇది ఘోర అవమానం అన్నట్లుగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube