యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ సినిమా విక్రమ్ సినిమా డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్‌లో ఉంది.నేడు కమల్ హాసన్ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ అయిన ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, నరైన్, కాళిదాస్ జయరాం వంటి వారు నటిస్తున్నారు.ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.ఇప్పటి వరకు ఎన్నో షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
కమల్ హాసన్‌కు కరోనా సోకడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది.అలా కాస్త బ్రేక్ ఇచ్చిన కమల్ హాసన్ నేడు షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టేశారు.
షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి ప్రముఖ తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.