కమల్ పోటీ అక్కడ నుంచే చేస్తారా?

విలక్షణ నటుడిగా సినీ కెరియర్ లో సక్సెస్ అయిన కమల్ హాసన్.గత కొంతకాలంగా రాజకీయ ప్రస్థానంలో సక్సెస్ అవ్వడం కోసం ఎన్నో వ్యూహరచనలు చేస్తున్నారు.

అందులో భాగంగానే గతంలో మైనారిటీ ఓటు బ్యాంకును సంపాదించడం కోసం త్యాగరాజ స్వామి పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.మరి అవి ఆయనకు ఆయన పార్టీకి ఎన్నికలలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో తమిళనాడులో వచ్చే యేడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తేలనున్నది.

Kamal Hassan Will Contest From There, Kamal Hasan, Makkal Needhi Maiam, Tamilana

అయితే తమిళనాడులో వచ్చే యేడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ ఇంతకీ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే చర్చ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది.ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కమల్‌హాసన్‌ నివాసముంటున్న మైలాపూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయనను పోటీ చేయవలసిందిగా ఆయన అనుయాయులు కోరుతున్నారట కానీ అందుకు కమల్ హాసన్ సుముఖత చూపట్లేదని ఆయన థౌజెండ్‌లైట్స్‌ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సుముఖత చూపుతున్నారని సమాచారం.

గతంలో ఆయన ప్రముఖ పార్టీ నాయకులు పోటీ చేసే ప్రాంతాలలో ఒకదాన్ని ఎంచుకొని అందులో నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.మరి తాజా సమాచారం మేర దానికి ఆస్కారం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

తాజా వార్తలు