రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి విక్రమ్.. జోరు మాములుగా లేదుగా..

Kamal Haasan's Vikram Joins Rs. 100 Crores Club, Vikram, Kamal Hassan, Lokesh Kanka Raju, Tollywood, Fahad Faisal, Vijay Sethupathi, Suriya

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా నటించిన సినిమా విక్రమ్.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

 Kamal Haasan's Vikram Joins Rs. 100 Crores Club, Vikram, Kamal Hassan, Lokesh Ka-TeluguStop.com

హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది.హిట్ లేకపోవడంతో తన ఫామ్ కోల్పోయాడు.

అయినా కూడా కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.

కమర్షియల్ హిట్ సాధించాక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్‘ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

చాలా రోజుల తర్వాత హిట్ అందుకోవడంతో కమల్ తో పాటు టీమ్ అంతా చాలా సంతోషంగా ఉంది.సక్సెస్ ఇచ్చిన సంతోషంలో అందరు సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసారు.

Telugu Fahad Faisal, Kamalhaasans, Kamal Hassan, Suriya, Vikram-Movie

ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య కూడా నటించారు.ఇంత మంది కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో నుండే అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి టాక్ తో స్టార్ట్ అయ్యింది.

ఇక కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వసూళ్లు చేస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ సినిమా సాలిడ్ వసూళ్ళని అందుకుంటూ దూసుకు పోతుంది.

కేవలం రెండు రోజుల్లోనే కమల్ విక్రమ్ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఇలా రెండు రోజుల్లోనే ఇంత వసూళ్లు చేయడం తో కోలీవుడ్ లో భారీ రికార్డ్ నమోదు చేసాడు.

ఈ సినిమాకు అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.మొత్తానికి కమల్ భారీ కంబ్యాక్ ఇచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube