ఆర్ఆర్ఆర్ సినిమాను పక్కకు నెట్టిన జనగణమన.. నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 గా ట్రెండ్!

ఈ మధ్య సినిమాలన్నీ థియేటర్ లోనే కాకుండా ఓటీటీ లో కూడా బాగా సందడి చేస్తున్నాయి.థియేటర్ లో ఎంత హడావిడి చేస్తున్నాయో నెట్ ఫిక్స్ లో కూడా అంతే హడావుడి చేస్తున్నాయి.

 Janaganamana Malayalam Movie Is Trending As Number 1 In Netflix, Janaganamana,-TeluguStop.com

ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్ లతో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా విడుదలయ్యాయి.ఇక కొన్ని సినిమాలు థియేటర్లో అంత సక్సెస్ అందుకోకున్న కూడా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటాయి.

మరికొన్ని సినిమాలు థియేటర్ లతో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.ఇక మొన్నటి వరకు నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ నెంబర్ వన్ ట్రెండ్ గా బాగా వెలిగింది.

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతంలో థియేటర్ లలో విడుదలయ్యింది.ఇక విడుదల రోజే ఈ సినిమా సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసుకుంది.

మొత్తానికి భారీ వసూళ్లతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.పలు భాషల్లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందడంతో నెట్ ఫ్లిక్స్ లో కూడా హిందీ వెర్షన్ లో విడుదల చేశారు.

దీంతో నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా బాగా సందడి చేసింది.మొన్నటి వరకు నెంబర్ వన్ గా ట్రెండ్ అయింది.

తాజాగా ఈ సినిమా సెకండ్ ట్రెండ్ కు దిగిపోయింది.కారణమేంటంటే ఇటీవలే విడుదలైన జనగణమన సినిమా.

డీజో జోస్ ఆంటోని దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జనగణమన‘.ఈ సినిమాల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజారామూడ్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమా మలయాళంలో రూపొందింది.ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.శ్రీ దివ్య హీరోయిన్ గా నటించగా ధ్రువన్, షమ్మీ తిలకన్, రాజా కృష్ణమూర్తి, వినోద్ సాగర్ తదితరులు కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా దిశ ఎన్ కౌంటర్ ఆధారంగా మరో నేపథ్యంతో, కథాంశం తో తెరకెక్కింది.

దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి బాగా ఆసక్తి చూపించారు.

ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైంది.

విడుదలైన రోజే ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.దీంతో ఈ సినిమాను ఈ నెల 2న నెట్ ఫ్లిక్స్ లో కూడా విడుదల చేశారు.

అక్కడ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

అంతే కాకుండా ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ ను పక్కకునెట్టి నెంబర్ 1 ట్రెండ్ గా ముందుకు వచ్చింది.ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.

ఇక ఈ సినిమా నెట్ ఫిక్స్ లో ఎన్ని రోజులు మొదటి స్థానంలో ట్రెండ్ గా మారుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube