''దళపతి67''లో రోలెక్స్ రోల్ లో విక్రమ్.. లోకేష్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు.ఈయన తమిళ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకుని కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు.

 Kamal Haasan To Have A Special Appearance Thalapathy 67, Thalapathy 67, Thalapat-TeluguStop.com

ఈయనకు తెలుగులో కూడా ఒక మాదిరిగా మార్కెట్ అయితే క్రియేట్ అయ్యింది.ఈయన నటించిన ప్రతీ సినిమా డబ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా విజయ్ కు ఫాలోయింగ్ ఉంది.

ఇక తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘వారసుడు‘ సినిమా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి విజయ్ స్టామినా ఏంటో నిరూపించింది.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ నెక్స్ట్ సినిమా కూడా వెంటనే లైన్లో పెట్టాడు.మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించి విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో దళపతి 67 సినిమా తెరకెక్కుతుంది.

Telugu Kamal Haasan, Kamalhaasan, Thalapathy, Trisha, Vikram-Movie

ఇక ఈ సినిమా నిన్న గ్రాండ్ గా చెన్నైలో స్టార్ట్ చేసారు.ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించారు.అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద అప్పుడే అంచనాలు భారీగా పెరిగాయి.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Telugu Kamal Haasan, Kamalhaasan, Thalapathy, Trisha, Vikram-Movie

ఇదిలా ఉండగా విక్రమ్ సినిమా యూనివర్స్ లో ఖైదీని ఎంటర్ చేసిన లోకేష్ దళపతి67లో కూడా కమల్ ని ‘విక్రమ్‘లా ఎంటర్ చేయబోతున్నాడు అని ఇందుకోసం కమల్ ను గెస్ట్ రోల్ లో ప్రవేశ పెట్టబోతున్నాడు అని విక్రమ్ లో సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్ కంటే ఈ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.మరి ఈసారి లోకేష్ ఏ రేంజ్ లో చూపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తాడో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube