నందమూరి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకున్న విషయంలో తెర ముందు తెర వెనుక ఎంతో కష్టం ఉంది.
చిన్న వయస్సులోనే హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ లుక్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా ఆ విమర్శలకు చెక్ పెడుతూ ప్రస్తుతం నంబర్ వన్ హీరోల రేసులో ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే తారక్ కు సపోర్ట్ చేస్తున్న విషయంలో కళ్యాణ్ రామ్ ను కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
నందమూరి ఫ్యామిలీలో కొంతమందితో జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ ఉంది.పొలిటికల్ గా జూనియర్ ఎన్టీఆర్ ఎదిగితే ఇబ్బందులు ఎదురవుతాయనే రీజన్ వల్ల నందమూరి కుటుంబ సభ్యులు కొందరు గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ఇలాంటి సమయంలో కళ్యాణ్ రామ్ నుంచి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ లభిస్తుండటం గమనార్హం.ఈ మధ్య కాలంలో కుటుంబానికి సంబంధించి ఎక్కడికి వెళ్లాల్సి ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కు తోడుగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.తమ్ముడిని వదలకుండా కళ్యాణ్ రామ్ అనుక్షణం జూనియర్ ఎన్టీఆర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయినప్పటికీ ఈ బ్యానర్ తన తమ్ముడి బ్యానర్ అనుకోవాలని కళ్యాణ్ రామ్ కొంతకాలం క్రితం కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య ఉన్న అనుబంధంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.కళ్యాణ్ రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కళ్యాణ్ రామ్ సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.








