ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక రోజుకొక సంఘటన జరిగింది.రెండు వేల పైచిలుకు మహిళలు పై దాడులు జరిగాయి.
మద్యం మత్తులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది.సంఘటన మాఫీ చేసేందుకు డబ్బులు ఎర చూపుతున్నారు.
మహిళలు అధికంగా ఉన్న ఈ ప్రభుత్వం లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం.అక్కడి స్థానిక ఎమ్మెల్యే సంబంధించిన వారు ఉన్నారు.
ఎప్పుడో 6వ తేదీన జరిగితే ఇప్పటివరకు బయటి ప్రపంచానికి వెల్లడించలేదు.ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన బాలిక కు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది.5లక్షలు ఇస్తే తప్పు ఒప్పవుతుందా.దిశ పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం నాడు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.ఇప్పుడు వారెవరూ మాట్లాడరేం.5గురు చే గ్యాంగ్ రేప్ జరిగితే ఇప్పటిదాకా ఎవరూ స్పందించలేదు జిల్లాలో ఇద్దరు మహిళా ఎంపీలు ఏం చేస్తున్నారు.శాంతిభద్రతలు అదుపు తప్పాయి.పోలీసులు ప్రతిపక్షాలను, నాయకులను అడ్డుకోవడానికి వున్నారు.వైసీపీ నాయకులుచంద్రబాబు, లోకేష్ లను తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నారు తప్ప పాలనపై దృష్టి పెట్టడం లేదు.కేసులు మాఫీ కొరకే ఢిల్లీ వేడుతున్నారు తప్ప దిశ చట్టం ఆమోదానికి ఎందుకు ప్రయత్నించరు.
ఈ ఘటన వెనుక నున్న వారిని తక్షణమే శిక్షించాలి.నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహిళా పోలీస్, విఆర్వో లను తక్షణం సస్పెండ్ చేయాలి.
అత్యాచార బాధితురాలికి 25లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి.







