కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో బాలికలు అస్వస్థతకు గురవుతున్నారు.
పాఠశాలలో మొత్తం 1500 మంది విద్యార్థులు చదువుతున్నారు.గత నాలుగు రోజులుగా కేవలం స్కూల్ లోని బాలికలు మాత్రమే హిస్టీరియా తరహాలో పడిపోతున్నట్లు గుర్తించారు.
అయితే ఈ విషయాన్ని ఉపాధ్యాయులు దాచిపెట్టడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సమాచారం తెలుసుకున్న విద్యార్థినీల తల్లిదండ్రులు స్కూల్ ను ముట్టడించారు.
అయితే బాధిత విద్యార్థినీలను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
.