Kajol : చేతి కర్ర సహాయంతో నడుస్తున్న కాజోల్.. ఆందోళన చెందుతున్న అభిమానులు?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి కాజోల్( Bollywood Actress Kajol Devgan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ప్రముఖ బాలీవుడ్ నటి తనూజ సమర్థ్ కూతురు అన్న విషయం తెలిసిందే.

 Kajol Injured Spotted Walking Elbow Crutch Mumbai-TeluguStop.com

తండ్రి షోము ముఖర్జీ ప్రముఖ దర్శక నిర్మాత అన్న విషయం కూడా తెలిసిందే.కాగా కాజోల్ తల్లిదండ్రులిద్దరూ ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో 16 ఏళ్ల వయసులోనే ఆమెకు సినిమా లలో అవకాశం వచ్చింది.

అలా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజోల్ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.సినిమాలలో నటించడంతో పాటు పలు రకాల బ్రాండ్ లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజోల్ పలు వెండితెరపై సినిమాలలో నటిస్తూనే వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ కాజోల్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా( Social Media )లో తెగ వైరల్ అవుతోంది.తాజాగా కాజోల్ చేతి కర్ర సహాయంతో నడిచే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో చేతి కర్ర సహాయంతో నడిచి వెళ్లే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోని బట్టి చూస్తే కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది.

ఆ కారణం చేతనే ఆమె మోచేతికి కర్ర( Elbow Crutch ) మెల్లిగా తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తోంది.తన కాలికి అంత పెద్ద గాయం తగిలినా కూడా కాజల్ ఆ విషయాన్ని బయటకు వెల్లడించలేదు.ఆ వీడియోని చూసినా కాజోల్ అభిమానులు ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు.

చేతికర్ర సహాయంతో నడుస్తున్నారు అంటే అంత పెద్ద దెబ్బ తగిలిందా ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదని పలువురు అభిమానులు కాజోల్ ని నిలదీస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం కాజోల్ వరుసగా వెబ్ సిరీస్( Kajol Web Series ) లలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube