కేర్ అండ్ కేరెస్ కొత్త స్టార్టప్ బిజినెస్ ప్రారంభించిన కాజల్!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ 2020 వ సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

 Kajal Started A New Startup Business Care And Cares , Kajal, Care And Cares, Sta-TeluguStop.com

ఇక పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ గర్భం దాల్చడంతో ఈమె సినిమాలకు దూరంగా ఉండి పూర్తిగా తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే తన కుమారుడు జన్మించి దాదాపు 5 నెలలు పూర్తి కావడంతో ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు.

ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఒక స్టార్టప్ బిజినెస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈమె కేర్ అండ్ కేరెస్ అనే బిజినెస్ ప్రారంభించినట్లు సమాచారం.

తన చెల్లెలితో కలిసి ఇప్పటికే ఎన్నో రకాల ఆన్లైన్ బిజినెస్ లను ప్రారంభించిన కాజల్ అగర్వాల్ తాజాగా తన ప్రాణ స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఈ బిజినెస్ ప్రారంభించారు.

Telugu Care, Kajal, Shilpa Reddy, Startup-Movie

కాజల్ అగర్వాల్ కొడుకు పుట్టిన తర్వాత బేబీ కేర్ ప్రోడక్ట్ గురించి ఎంతో అవగాహన ఏర్పడింది.ఈ క్రమంలోని బేబీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా ఈమె ఈ బిజినెస్ స్థాపించినట్లు సమాచారం.ఇలా బేబీ కేర్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని అందుబాటులో ఉండేలా తన స్నేహితురాలతో కలిసి ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.

ఏది ఏమైనా కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇంట్లో కూర్చొని ఎన్నో ప్రోడక్ట్ లకు ప్రమోటర్ గా వ్యవహరిస్తూ భారీగా సంపాదించారు.ఇలా ఒకవైపు సినిమాలు యాడ్స్ ద్వారా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా భారీగా సంపాదిస్తున్నారు.

ఇక త్వరలోనే ఈమె భారతీయుడు 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube