ప్రెగ్నెన్సీ తర్వాత ఫిట్నెస్ కోల్పోయిన కాజల్.. బాధపడుతూ పోస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ చందమామ కాజల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదని చెప్పవచ్చు.అతి తక్కువ సమయం లోనే తెలుగు నాట ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

 Kajal Lost Her Fitness After Pregnancy Sad Post Kajal, Lost Her Fitness ,pregn-TeluguStop.com

తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.కాజల్ లక్ష్మి కళ్యాణం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఆ తరువాత మగధీర సినిమాలో నటించగా ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ.

తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది.ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

మంచి హోదాలో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు తో కొంతకాలం రిలేషన్షిప్ లో ఉండి.అతడిని పెళ్లి చేసుకుంది.ఇక అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడిపింది.ఇక ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటూ తన భర్త తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది.

పెళ్లి తరువాత కూడా సినిమాలలో బాగా అవకాశలు అందుకుంది.ఇక తను గర్భవతి అని తెలిసాక సినిమాలకు దూరంగా ఉంది.

గర్భవతిగా ఉన్న కూడా వర్కౌట్లు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది.పైగా తన ఫోటో షూట్ లతో అందరిని ఆకట్టుకుంది.

మొత్తానికి ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.తనకు బాబు పుట్టడంతో సెలెబ్రేటిలతో పాటు తన అభిమానులు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు.

కాజల్ తన కొడుకు ఫోటోలు పంచుకోగా ఇప్పటివరకు పేస్ సరిగ్గా చూపించలేదు.ఇక కాజల్ డెలివరీ తర్వాత ఇదివరకు లాగే ఉంది.

ఒక బిడ్డ తల్లి అంటే తనను అస్సలు నమ్మరు.

పైగా బాగా ఎనర్జీగా కూడా కనిపిస్తుంది.అంతేకాదండోయ్ మళ్లీ వర్కవుట్లు చేయడం మొదలు పెట్టింది.నిజానికి ఇంత త్వరగా ఆమె వర్కవుట్లు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు.

పైగా తను వర్కౌట్ లు చేసిన వీడియోలను కూడా మళ్లీ పంచుకుంటుంది.కానీ ఎనర్జీగా మాత్రం లేనట్లుగా ఉంది.మాములుగా చూడటానికి ఫిట్ గా ఉంది అన్నట్లుగా కనిపిస్తుంది కానీ అంతా యాక్టివ్ గా లేదని చెప్పవచ్చు.

దీంతో ఆమె ఫోటో పంచుకోగా అందులో ఆ ఫోటోకు తను కాస్త బాధపడినట్లు కనిపించింది.అది ఒకప్పటి ఫిట్నెస్ ఫోటో అని షేర్ చేయగా.అది చూసి నెటిజన్స్ త్వరలోనే ఫిట్ అవుతావు అంటూ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలిసింది.ఇక అందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube