టాలీవుడ్ లో కాజల్ ( Kajal )ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాలి.లక్ష్మీ కళ్యాణం అనే ఫ్లాప్ మూవీ తో ఆమె ఎంట్రీ ఇచ్చింది.
అదృష్టం బాగుండటం తో మరిన్ని సినిమాలు వచ్చాయి.ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకోవడం వల్ల కాజల్ కి మంచి అవకాశాలు రావడం మొదలు అయ్యాయి.
చందమామ సినిమా( Chandamama Movie ) తో కాజల్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఇక రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన రామ్ చరణ్ మగధీర్ సినిమా తర్వాత కాజల్ పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
ఈ మధ్య కాలంలో సినిమాలు తక్కువ అయ్యాయి.కరోనా సమయంలో పెళ్లి చేసుకుంది.
ఆ సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చింది.పెళ్లి తర్వాత సౌత్ హీరోయిన్స్ ఇంటికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది.
కానీ కాజల్ అగర్వాల్ అలా అవ్వాలి అనుకోలేదు.అందుకే బ్యాక్ టు సెట్స్ అన్నట్లుగా బౌన్స్ బ్యాక్ అయింది.
అందం విషయం లో ఏమాత్రం తగ్గలేదు.దాంతో హీరోయిన్ గా ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి.బాలయ్య( Balayya ) హీరోగా నటించిన భగవంత్ కేసరి( Bhagwanth Kesari ) సినిమా లో కాజల్ అగర్వాల్ కి ఛాన్స్ దక్కింది.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా కాజల్ పాత్ర కు పెద్దగా గుర్తింపు రాలేదు.
చిన్న పాత్ర పైగా ప్రాముఖ్యత లేని పాత్ర అవ్వడం వల్ల సినిమా చూసిన వారు ఆ పాత్ర ను లైట్ తీసుకుని వదిలేస్తున్నారు.దాంతో కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ పై పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యేలా ఉన్నాయి.
మొత్తానికి కాజల్ అగర్వాల్ మళ్లీ బిజీ అవ్వాలి అనుకుంటే అది సాధ్యం అయ్యేలా లేదు.కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ప్రస్తుతం రెండు సినిమా లు రూపొందుతున్నాయి.
అవి అయినా సక్సెస్ అయ్యేనా చూడాలి.