చిత్రం : కాదలి
బ్యానర్ : అనగనగా ఫిలిం కంపెనీ
దర్శకత్వం : పట్టాభి ఆర్ చిలుకూరి
నిర్మాత : పట్టాభి ఆర్ చిలుకూరి
సంగీతం : ప్రసన్న ప్రవీన్ శ్యామ్
విడుదల తేది : జూన్ 9, 2017
నటీనటులు : హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, పూజ దోషి తదితరులు
కథలోకి వెళితే :
బాంధవి (పూజ దోషి) ఓ మధ్యతరగతి అమ్మాయి.ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది.
ఈ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉంటాయి.అప్పులున్న ఫ్యామిలితో సంబంధం ఇష్టం లేక బాంధవికి పెళ్ళి కుదరదు.
ఈ జన్మకి తనకి పెళ్ళికి అవుతుందా అనే నిరాశలో ఉన్న బాంధవి, తానే ఓ అబ్బాయిని డేట్ చేసి పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది
ఇలాంటి సమయంలో బాంధవికి ఇద్దరు అబ్బాయిలు కార్తిక్ (హరీష్ కళ్యాణ్), క్రాంతి (సాయి రోనక్) పరిచయమవుతారు.ఇద్దరితో ఫ్రెండ్ షిప్ చేసే బాంధవి, ఇద్దరిలో ఎవరితో తను జీవితంలో ముందుకెళ్ళాలో నిర్ణయించుకోవంలో అయోమయానికి లోనవుతుంది.చివరకి బాంధవి ఇద్దరిలో తన ఓటు ఎవరికి వేసిందో తెర మీద చూడండి.
నటీనటుల నటన :
పూజ కే దోషి అస్సలు ఆకట్టుకోలేదు.అమ్మాయి తెలుగులో డైలాగులు కూడా చెప్పకుండా చాలా సీన్లు లాగేసింది.ఎవరు వినని గొంతుతో డబ్బింగ్ చెప్పించినా ఎంతోకొంత నేచురాలిటి కనిపించేదేమో.మనం చాలాసార్లు విన్న గొంతే కావడంతో తన ఇంటర్యాక్షన్స్ పెద్దగా ఎక్కవు
తనిళనటుడు హరీష్ కళ్యాణ్ కి ఇదే తొలి తెలుగు సినిమా.సినిమాలో నటుడిగా ఆకట్టుకున్నది తన ఒక్కడే.
అనుభవం తీసుకొచ్చే తేడా అదేనేమో.డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడు.
పేరుకి తమిళనటుడు అయినా, ఆ వాసన ఎక్కడా ఉండదు.ఇంప్రెసివ్ డెబ్యూ అని చెప్పొచ్చు.
సాయి రోనక్ చాలా ఆర్టిఫషియల్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రయత్నాలైతే చేసాడు.క్లిక్ అవలేదు.
పబ్లిసిటి డిజైనర్ భాను చేసిన కామెడి ప్రయత్నం ఎక్కడా కూడా నవ్వు తెప్పించదు.విసుగు మాత్రం తెప్పిస్తుంది.
టెక్నికల్ టీమ్ :
టెక్నికల్ డిపార్టుమెంటులో పెద్ద పేర్లే ఉన్నాయి.శేఖర్ వి జోసేఫ్ సినిమాటోగ్రాఫి బాగుంది.
లాంగ్ షాట్స్, బర్డ్ వ్యూ యాంగిల్స్ లో హైదరాబాద్ నగరాన్ని బాగా చూపించారు.మొదటి రెండు పాటలు మినహా ఆల్బమ్ చాలా బాగుంది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నీట్ గా బాగుంది.మార్తాండ్ కే వెంకటేష్ లాంటి సీనియర్ ఎడిటర్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయారు.
ఎంతలేదన్నా, ఓ అరగంట సినిమాని చాలా సులువుగా ట్రిమ్ చేయొచ్చు.ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చాలా ఖర్చుపెట్టారు.రైటింగ్ అస్తవ్యస్తంగా ఉంది.ఈ సినిమా స్క్రీన్ ప్లే మీద ఆనంద్ రంగా వర్క్ చేసినా లాభం లేకుండాపోయింది.
విశ్లేషణ :
పెళ్ళిచూపులు .మ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ లేరు, రిచ్ లోకేషన్స్ వాడలేదు.హీరోహీరోయిన్ల గురించి సినిమా చూసిన తరువాతే తెలుసుకోవడం ప్రారంభించారు జనాలు.
కాని సినిమా బంపర్ సక్సెస్.ఎందుకంటే అనవసరం అనిపించే సీన్లు ఉండవు, ఉన్న చిన్న కథని సహజంగా చెప్పారు.
నేచురల్ టేకింగ్ ఆ సినిమా బలం.ఇలాంటి సినిమాలు తెలుగులో ఇంకా రావాలంటూ అందరు అనుకుంటన్న సమయంలో కొంతకాలం క్రితం పిట్టగోడ అనే సినిమా వచ్చింది, ఇప్పుడు కాదలి.ఆ సినిమా పెంచిన అంచనాల వలనేమో, ఏ చిన్న సినిమా యూత్ ఫుల్ కథాంశంతో వచ్చినా ఆ సినిమాతోనే పోల్చిచూస్తున్నారు
అదేవిధంగా ఈ సినిమాకి, పెళ్ళిచూపులకి తేడా ఏమిటంటే, అందులో నిజజీవితంలో ఉండే సంభాషణలు ఉంటే, ఇందులో టిపికల్ తెలుగు సినిమా డైలాగ్స్ ఉన్నాయి, ఆ సినిమాలో పాటలు కూడా కథలో భాగంగా ఉంటే, ఇందులో పాటలు విసుగు తెప్పిస్తాయి.ఆ సినిమాకి ఆర్టిస్టులు పెద్ద ప్లస్ అయితే, ఈ సినిమాకి హరీష్ కళ్యాణ్ తప్ప అందరు మైనసే.
అందులో లైట్ హార్టేడ్ కామెడీతో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే, ఇందులో బోర్ కొట్టించే మెలోడ్రామా ఉంది.టేకింగ్ అక్కడ ఫ్రెష్ గా ఉంటే ఇక్కడ పరిపక్వత కరువైంది.టార్గేట్ చేసిన ఏ సెంటర్ ఆడియెన్స్ కి కూడా ఈ సినిమా సహనానికి పరీక్షే.
ప్లస్ పాయింట్స్ :
* సినిమాటోగ్రాఫి* బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
* టేకింగ్
* ఇలాంటి కథలో ఉండాల్సిన నేచురాలిటి లేదు
* విసిగించే పాటలు
* సహనాన్ని పరీక్షించే ఎడిటింగ్
* కాస్టింగ్ (ముఖ్యంగా హీరోయిన్)
చివరగా :
విఫలయత్నం