జనసేన నినాదాన్ని కాపీ కొట్టిన కేఏ పాల్

ఇటీవల కాలంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయంగా తెగ హడావిడి చేస్తున్నారు.ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కేఏ పాల్ హల్‌చల్ చేస్తున్నారు.

 Ka Paul Who Copied The Jana Sena Slogan Andhra Pradesh , Ka Paul, Janasena, 2024-TeluguStop.com

ఆయన 2019 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసినా ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు.ఓడిపోయిన తర్వాత చాలా కాలం కేఏ పాల్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

అయితే గత ఎన్నికల్లో క్రైస్తవుల, ఎస్సీ ఓట్లు పూర్తిగా వైసీపీకి పోకుండా ఉండేందుకు చంద్రబాబే కేఏ పాల్‌తో పార్టీ పెట్టించారని అప్పట్లో ప్రచారం జరిగింది.

మరోసారి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేఏపాల్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇటీవల కాకినాడ నుంచి పాల్ తన ఏపీ పర్యటనను ప్రారంభించారు.ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కసీటు కూడా రాదని.

ఆ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్లకు కనీసం డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు.పాల్ రావాలి.

పాలన మారాలి పేరుతో తాను యాత్ర చేపడుతున్నానని ఆయన తెలిపారు.అయితే ఇది జనసేన పార్టీ నినాదం అని.తమ నినాదాన్ని కేఏ పాల్ కాపీ కొట్టారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.పవన్ రావాలి.

పాలన మారాలి అని తాము ఎప్పటినుంచో ఏపీలో ప్రచారం చేస్తున్నామని వాళ్లు గుర్తుచేస్తున్నారు.

అటు ఏపీ వ్యాప్తంగా తన యాత్ర కోసం కేఏ పాల్ మొత్తం ఐదు కార్లు రెడీ చేసుకున్నారు.

వీటిలో తన అనుచరులతో పాటు బౌన్సర్లు కూడా ప్రయాణించేలా ప్లాన్ చేసుకున్నారు.ఈ మేరకు కాకినాడలోని సీబీఎం స్కూలులో ఐదు కార్లను పార్క్ చేశారు.

కానీ పార్క్ చేసిన ఐదు కార్లలో ఉదయానికి కేవలం మూడు కార్లే కనిపించాయి.మరో రెండుకార్లు కనిపించలేదు.

అంతే కాదు మిగతా కార్లు కూడా ఆ స్కూల్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లకుండా యాజమాన్యం తాళాలు వేసింది.

Telugu Andhra Pradesh, Ap, Janasena, Ka Paul-Telugu Political News

అయితే కేఏ పాల్ పార్క్ చేసిన ఐదు కార్లలో రెండింటిని ఎత్తుకెళ్లింది జనసేన కార్యకర్తలే అని ఆ తర్వాత తేలింది.పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ వ్యాఖ్యలకు నిరసనగానే జనసేన కార్యకర్తలు పాల్ కార్లను ఎత్తుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది.కాగా కాకినాడలో తన వాహనాలను తీసుకెళ్లిన వారిని దేవుడే శిక్షిస్తాడని పాల్ శాపనార్థాలు పెట్టారు.

కాపులు, దళితుల ఓట్లను ఎవరూ కొనలేరని.వచ్చే ఎన్నికలు ఆ రెండు సామాజిక వర్గాలు తనతోనే ఉంటాయని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube