KA Paul Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి పై కేఏ పాల్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల విజయసాయిరెడ్డి తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయిందని విమర్శించారు.ఇదే సమయంలో అధికారమే లక్ష్యంగా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్( Congress ) మోసం చేసిందని ఆరోపించారు.

ఆ రకంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.దీంతో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Ka Paul Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి పై క

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని విజయసాయిరెడ్డి ( YCP Vijaya Sai Reddy )వ్యాఖ్యలపై కేఏ పాల్ మండి పడటం జరిగింది.నువ్వు ఏమైనా బీజేపీ( BJP ) అధికార ప్రతినిధివా.మోదీకి తొత్తువా అంటూ మండిపడటం జరిగింది.

Advertisement
KA Paul Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి పై క

ఏపీలో మరో రెండు మూడు నెలలలో ఏమవుతుందో తెలుసా అంటూ ప్రశ్నించారు.ఓడిపోవడానికి సిద్ధమా.? సర్వనాశనం చేయడానికా.? దోచుకోవడానికా.? అంటూ విజయసాయిరెడ్డి పై కేఏ పాల్ మండి పడటం జరిగింది.ఏపీలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికలలో విశాఖపట్నం ఎంపీగా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు.ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పై విమర్శలు చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు