KA Paul Munu Godu Elections : పోలింగ్ బూత్ నుంచి పరుగులు పెట్టిన కేఏ పాల్!!

మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ రసవత్తరంగా జరుగుతోంది.ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.

ఇంకా కొనసాగుతోంది.ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో తొలిసారిగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పర్యవేక్షణలో ఎన్నికలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి.

ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో పోరాటం చేస్తున్నారు.భారీ పోటీ నెలకొనడంతో ఎన్నికల అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
Ka Paul Ran From The Polling Booth Munu Godu-VIDEO: పోలింగ్ బ�

మునుగోడులో బీసీ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది.అయితే ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే విషయంపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో సహా బీఎస్పీ తరఫున అందోజు శంకరాచారి, టీజేఎస్ పార్టీ అభ్యర్థి పల్లె వినయ్ కుమార్, అలాగే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ బరిలో ఉన్నారు.అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ అందరినీ ఆకట్టుకుంటన్నారు.ఒక సెంటర్ నుంచి మరో సెంటర్‌ను పరుగులు పెడుతున్నారు.

అలా పరుగులు పెడుతున్న వీడియోలు ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి.

Ka Paul Ran From The Polling Booth Munu Godu
చిరంజీవిని బలవంతం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది..

ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన కేఏ పాల్.ఊహించని విధంగా పరుగులు పెట్టాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కేఏ పాల్ ఎంతో టెన్షన్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది.అయితే ఆయన పరుగులు పెట్టిన తీరును చూసి నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

కాగా, మునుగోడు ఎన్నికల ప్రచారంలో కూడా కేఏ పాల్ ఓటర్లను ఎంతో ఆకట్టుకున్నారు.కాగా, సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.

తాజా వార్తలు