Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ గొప్పదనానికి ఇంతకంటే ప్రూఫ్ కావాలా.. స్నేహం కోసం అలా చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Hero Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్( Global Star ) గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకున్నారు.కాగా ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమా( Devara Movie ) నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.కాగా తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.

Advertisement

అదేమిటంటే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా( Nannaku Prematho )లో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కు అన్నయ్య పాత్రలో నటించారు.

కాగా రాజీవ్ కనకాల( Rajiv Kanakala ) జూనియర్ ఎన్టీఆర్ మధ్యాహ్నం స్నేహబంధం గురించి కూడా మనందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రాజీవ్ కనకాల తో పాటు మిగిలిన నటీనటులకు 3స్టార్ హోటల్ బుక్ చేయగా స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ ని బుక్ చేశారట.

ఒక రెండు రోజులు షూటింగ్ గడిచిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల దగ్గరికి వచ్చి అక్కడ నా ఉండడానికి నాకు బోర్ కొడుతోంది నువ్వు కూడా అక్కడికి వచ్చేయొచ్చు కదా అని జూనియర్ ఎన్టీఆర్ అనగా వద్దులేరా బాబు ప్రొడ్యూసర్ గారికి అనవసరంగా నష్టం అని అనగా సపరేట్ రూమ్ అక్కర్లేదు నాతోపాటు నా రూమ్ లో ఉండు అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారట.అందుకు రాజీవ్ కనకాల ఒప్పుకోలేదట.దాంతో మళ్లీ ఒక రెండు రోజులు చూసిన ఎన్టీఆర్ చేసేదేం లేక చొప్పబెట్టకుండా ఆ ఫైవ్ స్టార్ హోటల్ లో ఖాళీ చేసి వెంటనే రాజీవ్ కనకాల ఉండే 3 స్టార్ హోటల్ కి వచ్చేసారట.

అదేంటి అలా వచ్చేసావు అని రాజీవ్ కనకాల అడగక మీరు అక్కడికి రారు మీరేమో ఇక్కడ నేను అక్కడ ఫుల్ బోరింగ్ గా ఉంది అందుకే వచ్చేసాను అని చెప్పారట.అలా స్టార్ హీరో అయి ఉండి జూనియర్ ఎన్టీఆర్ అలా చేసే సరికి రాజీవ్ కనకాల ఆశ్చర్యపోయారట.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్( Social Media ) అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఎన్టీఆర్ మంచితనానికి ఇంతకంటే నిదర్శనం కావాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement