ఆర్ఆర్ఆర్ మూవీ(RRR)కి ఆస్కార్ అవార్డ్(Oscar Award) రావడంతో రాజమౌళి(Rajamouli) కొత్త ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.ఆస్కార్ అవార్డ్ వల్ల ప్రపంచ దేశాల్లో జక్కన్న పేరు మరోమారు మారుమ్రోగుతోంది.
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ఎన్టీఆర్(NTR) కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.ఈ నెల 29వ తేదీ నుంచి ఎన్టీఆర్30 మూవీ షూట్ మొదలుకానుందని తారక్ కామెంట్లు చేయడం గమనార్హం.
ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ కు ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదని ఆయన అన్నారు.మా సంతోషాన్ని వ్యక్తపరచడానికి మాటలు సరిపోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడం ఆర్.ఆర్.ఆర్ యూనిట్ కే కాదని ప్రపంచానికే గర్వ కారణమని ఆయన కామెంట్లు చేశారు.ఇది ప్రారంభం మాత్రమేనని నేను నమ్ముతున్నానని తారక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజమౌళి లాంటి స్టోరీ టెల్లర్ లేకపోతే ఈ సక్సెస్ సాధ్యం అయ్యేది కాదని ఆయన తెలిపారు.ఎలిఫెంట్ ఎస్పరర్స్ టీంకు కూడా తారక్ అభినందనలు తెలిపారు.ఆర్ఆర్ఆర్ సీక్వెల్ (RRR Sequel)మొదలయ్యే వరకు ఆగలేకపోతున్నానని ఆయన కామెంట్లు చేశారు.రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఎప్పుడనే ప్రశ్నకు జవాబు తనకు చెప్పలేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేయడం గమనార్హం.

ఆస్కార్ అవార్డులకు జక్కన్న దారి చూపించారని ఆ దారిలో ఇకపై టాలీవుడ్ దర్శకనిర్మాతలు నడవనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఏ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతుందో చూడాలి.ఈ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేసేలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ తరహా సినిమాలు మరిన్ని తెరకెక్కాలని మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ విజయంతో మరిన్ని ఇండస్ట్రీ హిట్లను తెరకెక్కేంచే స్క్రిప్ట్ లపై రాజమౌళి దృష్టి పెట్టారు.







