'సలార్' క్లైమాక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ మరియు యాష్..కంఫర్మ్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్!

Junior Ntr And Yash In Prabhas Salaar Movie Climax Details, Junior Ntr , Hero Yash ,prabhas, Salaar Movie, Salaar Movie Climax, Director Prasanth Neel, Kgf Chapter 2, Ntr Yash, Salaar Movie Update, Prabhas Salaar Movie

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటిస్తున్న ‘సలార్’ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే.బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.దీంతో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఊర మాస్ యాక్షన్ ఫిలిం లో అభిమానులు చూడాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు.‘సలార్’ చిత్రం( Salaar ) అలాంటిదే అని పోస్టర్స్ మరియు టీజర్ చూసినప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది.అందుకే ఈ చిత్రం కోసం సినీ అభిమానులు అంతలా ఎదురు చూస్తున్నారు.సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడాల్సి వచ్చింది.

 Junior Ntr And Yash In Prabhas Salaar Movie Climax Details, Junior Ntr , Hero Ya-TeluguStop.com

రీసెంట్ గానే ఈ చిత్రాన్ని డిసెంబర్ 22 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసారు మేకర్స్.

Telugu Prasanth Neel, Yash, Ntr, Kgf Chapter, Ntr Yash, Prabhas, Prabhas Salaar,

ఈ నెల 23 వ తారీఖున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ట్రైలర్ ని విడుదల చేసేందుకు సిద్ధం గా ఉన్నారు మేకర్స్.ఈ ట్రైలర్ తర్వాత విడుదలకు దగ్గర పడే సమయం లో మరో ట్రైలర్ ఉంటుందట.ఇదంతా పక్కన పెడితే ‘సలార్’ చిత్రానికి ‘కేజీఎఫ్’ చాప్టర్ 2( KGF 2 ) చిత్రం తో లింక్స్ ఉంటాయని ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ఒక రూమర్ ఉంది.

కేజీఎఫ్ చాప్టర్ 2 పోస్ట్ క్రెడిట్స్ తర్వాత వచ్చే సన్నివేశం లో కనిపించే లొకేషన్ ని మనం ‘సలార్’ చిత్రం టీజర్ లో చూడొచ్చు.అంటే కేజీఎఫ్ తో ఈ సినిమాకి లింక్స్ ఉన్నట్టే.‘సలార్’ క్లైమాక్స్ లో రాకీ భాయ్ పాత్ర లో హీరో యాష్( Yash ) కనిపించబోతున్నాడని టాక్.కేవలం యాష్ మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లైమాక్స్ లో మెరుస్తాడట.

Telugu Prasanth Neel, Yash, Ntr, Kgf Chapter, Ntr Yash, Prabhas, Prabhas Salaar,

ఎన్టీఆర్ తో( Jr NTR ) ప్రశాంత్ నీల్( Prasanth Neel ) త్వరలోనే ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ పాత్రకి మరియు ‘సలార్’ చిత్రానికి కూడా లింక్ ఉంటుందట.అలా ముగ్గురు పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్, మూడు ఐకానిక్ రోల్స్ ద్వారా వెండితెర మీద కనిపిస్తే ఆడియన్స్ కి మరియు ఫ్యాన్స్ కి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము.బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే.

ఈ రికార్డ్స్ ని కొట్టడానికి కనీసం 5 ఏళ్ళ సమయం పట్టాలి, ఆ రేంజ్ లో ప్రభాస్ కొట్టబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube