తెలంగాణలో జంగిల్ సఫారీ తిరిగి అందుబాటులోకి వచ్చింది.. మీరు రెడీనా.. !

జీవితాన్ని ఎగ్జైటింగ్‌గా గడపాలనుకునే వారు ఎలాంటి సాహసాలు చేయడానికైనా వెనుకాడరు.మరి అలాంటి వారికి జంగిల్‌ సఫారీ చిరునామగా చెప్పవచ్చూ.

ఇకపోతే కరోనా వల్ల చాలా మంది ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, జంగిల్ సఫారి వంటి వాటికి దూరం అవవలసి వచ్చింది.ఇక కరోనా తగ్గుముఖం పట్టడమే కాదు.

ప్రకృతి ప్రేమికులని మురిపించే కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి.ఇందులో భాగంగానే తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా పరిధిలో కవ్వాల్‌ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) వద్ద ఉన్న జంగిల్ సఫారీ వీక్షించే అవకాశం మళ్లీ లభిస్తుంది.

దాదాపు సంవత్సరం తర్వాత జంగిల్‌ సఫారీనీ ప్రారంభించేందుకు అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.కాగా దాదాపు 30 కి.మీ ప్రయాణంలో ఎన్నో అందమైన అనుభూతులను సొంతం చేసుకోవచ్చని జన్నారం డివిజనల్‌ ఫారెస్ట్ ఆఫీసర్ మాధవ్‌రావు తెలిపారు.ఇకపోతే వీటి టికెట్ ఛార్జీలు తెలుసుకుంటే ఒక్కో వ్యక్తికి ప్రస్తుతం ఛార్జీ రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఉండగా మరో రూ.200 నుంచి రూ.500 కు పెంచనున్నట్లు తెలుస్తుంది.ఇకపోతే దేశంలోని 42 వ రిజర్వ్ అయిన కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్ 2012 లో సృష్టించారు.

Advertisement

ఇదిలా ఉండగా ఆదిలాబాద్, కుమ్రంభీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల నాలుగు జిల్లాల పరిధిలోకి వచ్చే అడవులను కలుపుతూ 1,120 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 893 చదరపు కిలోమీటర్ల మేర బఫర్ జోన్ విస్తరించి ఉంది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు