యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు నిరీక్షించారు.
నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడంతో ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.ఇక ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ అంతా ఈయన నెక్స్ట్ సినిమా ‘ఎన్టీఆర్ 30’ కోసమే ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు అయితే వెళ్ళలేదు.అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులే జరుగుతున్నాయి కానీ స్టార్ట్ చేయలేదు.ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి కొరటాల అంచనాలు పెంచేసాడు.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ లైనప్ లో మరొక డైరెక్టర్ కూడా ఉన్నారు.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పటికే వీరి సినిమా అఫిషియల్ గా ప్రకటించారు.ప్రెజెంట్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాను చేస్తూ బిజీగా ఉన్నాడు.ఎన్టీఆర్ 30వ సినిమా పూర్తి చేసేలోపు నీల్ సలార్ సినిమాను పూర్తి చేసి నెక్స్ట్ ఎన్టీఆర్ 31 వ సినిమాను స్టార్ట్ చేయనున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.ఎన్టీఆర్ తల్లి షాలినీ గారు కన్నడకు చెందిన వారు కావడంతో ఎన్టీఆర్ కు కూడా కన్నడ భాష బాగా తెలుసు.అందుకే నీల్ ఈ సినిమాను కన్నడలో డబ్బింగ్ చేయడం కంటే డైరెక్ట్ కన్నడ సినిమా గానే తెరకెక్కించాలని అనుకుంటున్నారట.
అందులోను ఎన్టీఆర్ కు కన్నడలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.దీంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.చూడాలి మరి ఈ భారీ బడ్జెట్ సినిమాను నీల్ ఎలా తెరకెక్కిస్తారో.