ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ (Rave party) పెద్ద ఎత్తున సంచలనాలకు కారణమైంది.గత నెల 20వ తేదీ బెంగళూరులోని ఒక ఫామ్ హౌస్ లో ఓ ప్రముఖ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
ఇందులో భారీ స్థాయిలో డ్రగ్స్ (Drugs) ఉపయోగిస్తున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు.ఈ దాడిలో భాగంగా 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇందులో 70 మంది మగవారు ఉండగా 30 మంది మహిళలు ఉన్నారు.

ఇక ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వారికి పరీక్షలు చేయగా సుమారు 86 మంది వరకు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి.ఇక ఈ రేవ్ పార్టీలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.అందులో నటి హేమ (Hema) కూడా ఉన్నట్టు పోలీసుల వెల్లడించారు.
అంతేకాకుండా ఈమెకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపించారు.

ఇలా నోటీసులు అందజేసినప్పటికీ ఈమె విచారణకు హాజరు కాకపోవడంతో బెంగుళూరు సీబీఐ పోలీసులు ఆమెను గత రాత్రి అరెస్టు చేశారు.ఇలా పోలీసులు తనని అరెస్టు చేసినప్పటికీ కూడా తాను ఆ పార్టీలో పాల్గొనలేదని ఆమె తేల్చి చెప్పారు.అయితే హేమను అరెస్టు చేసిన అనంతరం పోలీసులు తనని కోర్టుకు హాజరు పరచగా కోర్టు 10 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది.ఇలా ఈ రేవ్ పార్టీలో భాగంగా ఈమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
ఇక హేమతో పాటు మరి కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.







