బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెలువడనుంది.ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు( Delhi Rouse Avenue Court ) మరికాసేపట్లో తీర్పును ప్రకటించనుంది.
తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును ఇవాళ వెలువరించనుంది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam )లో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్( Interim Bail Petition ) ను ఈడీ వ్యతిరేకిస్తుంది.బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని వాదించిన ఈడీ సాక్షులను, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది.కాగా కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







