ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీకి ఊహించని టైటిల్..?

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీరరాఘవ సినిమా తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది.

అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ త్రివ్రిక్రమ్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు మొదట "అయినను పోయిరావలె హస్తినకు", " రాజా వచ్చినాడు" అనే టైటిల్స్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఈ రెండు టైటిల్స్ కాకుండా దర్శకుడు త్రివిక్రమ్ "చౌడప్ప నాయుడు" అనే మరో టైటిల్ ను పరీశీలిస్తున్నాడని. చౌడప్ప నాయుడు టైటిల్ ఈ సినిమాకు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

కథ ప్రకారం ఈ టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Jr Ntr Trivikram Srinivas Movie Title Chowdappa Naidu, Choudappa Naidu, Ayinanu
Advertisement
Jr Ntr Trivikram Srinivas Movie Title Chowdappa Naidu, Choudappa Naidu, Ayinanu

గతంలో బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన నరసింహ నాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గానిలిచింది.గతంలో కులం సెంటిమెంట్ ను జోడిస్తూ ఎక్కువగా సినిమాలు తెరకెక్కినా ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు రావడం లేదు.ఈ సినిమాలో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడని కథ ప్రకారం ఇదే టైటిల్ సినిమా కథకు సూట్ అవుతుందని తెలుస్తోంది.

అయితే ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.మరోవైపు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా రష్మిక మందన్నా లేదా జాన్వీ కపూర్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు