సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో నటించిన తర్వాత కూడా ఒక విజయం కూడా వరించకపోతే వారు వెలుగులోకి రారని చెప్పవచ్చు.కేవలం ఒకే ఒక్క హిట్ పడితే చాలు ఓవర్ నైట్ లో స్టార్ డం అందుకున్న వాళ్లు మన చిత్ర పరిశ్రమలో అనేకమంది ఉన్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.వివి వినాయక్ దర్శకత్వంలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘ ఆది'( Aadi ).
ఈ సినిమాకు సంబంధించి మొదటి చర్చ జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటిస్తున్న సమయంలో వారు చిత్రీకరణ కోసం స్విజర్లాండ్ కు వెళ్లారు.అక్కడ షూటింగ్ అయిన తర్వాత భారత్ కు బయలుదేరడానికి సినిమా బృందం మొత్తం సిద్ధంగా ఉంది.
ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు.అందులో మనకు అందరికీ సుపరిచితుడైన బుజ్జి, ఆయనతోపాటు డైరెక్టర్ వివి వినాయక్( Director VV Vinayak ). అలా వెళ్ళిన వాళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ తో మా దగ్గర మీకు సరిపోయే కథ ఒకటి ఉంది వినండి అంటూ తెలిపారు.

దీంతో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే తనని హైదరాబాదు( Hyderabad )లో కలవండి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఆ తర్వాత కొద్ది రోజులకు ఎన్టీఆర్ చెప్పినట్లేదని వివి వినాయక్, బుజ్జి కథ చెప్పడానికి హైదరాబాదులో ఎన్టీఆర్ ని కలిశారు.అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ ను చూసి చూడటానికి రౌడీలా ఉన్నాడు ఇతడు తనతో సినిమా తీయగలడా అని అనుకున్నారట.
పరిస్థితి ఎలా ఉన్నా వివి వినాయక మాత్రం ఎన్టీఆర్ కి కథ చెప్పేందుకు సిద్ధమయ్యాడు.అయితే ఆ సమయంలో ఎన్టీఆర్( Junior NTR ) తనకు కథ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదని కేవలం ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చెప్తే చాలని తెలిపారు.
దాంతో వినాయక్ తాను కేవలం ఇంట్రడక్షన్ ఒక్కటే చెబుతానని అది నచ్చితేనే మీకు మిగతా కథ చెబుతానని కథ మొదలుపెట్టాడు.అలా ఏకంగా రెండు గంటలపాటు పూర్తి కథను విన్న తర్వాత మనం ఈ సినిమా చేస్తున్నామని ఎన్టీఆర్ తెలిపారు.
అయితే ఈ విషయం కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood )లో కొన్ని రోజులు బాగా స్ప్రెడ్ అయింది.

ఆపై ఎన్టీఆర్ నుండి వివి వినాయక్ ఓ కబురు అందింది.దాంతో ఆయన వెంటనే ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్లగా తనకి ఇప్పుడు లవ్ స్టోరీలు( Love Stories ) చేయడం ఇష్టం లేదని.ఏదైనా మాస్ కథ ఉంటే చెప్పమని అన్నాడు.
దాంతో వెంటనే ఇదివరకు తాను అనుకున్న కొన్ని సీన్లను ఎన్టీఆర్ కు వివరించాడు.అందులో చిన్న పిల్లవాడు బాంబులు వేయడం, ఫ్యాక్షన్ లాంటి అంశాలను చెప్పడంతో తనకు ఫ్యాక్షన్ సినిమాలు( Faction Movies ) హెవీ అవుతాయేమో అని అన్నట్లుగా మాట్లాడితే తనని ఎలాగైనా వదిలించుకోవాలని అలా మాట్లాడుతున్నాడని భావించిన టైం ఇవ్వండని చెప్పి కేవలం ఏడు రోజుల్లో ఏకంగా 58 పేజీల స్క్రిప్టును రెడీ చేసి ఎన్టీఆర్ కు వివరించాడు.
కథ విన్న ఎన్టీఆర్ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనమే తీద్దామంటూ వివి వినాయక్ అవకాశం ఇచ్చాడు.ఆ తర్వాత రిలీజ్ అయిన ఆది సినిమా ఎంత భారీ హిట్ సాధించిందో.
ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.