అక్కడ దేవర ఐమ్యాక్స్ వెర్షన్ కు సైతం అదిరిపోయే రెస్పాన్స్.. తారక్ రేంజ్ వేరే లెవెల్!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

అందులో భాగంగానే ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం దేవర.( Devara ) కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమా ఈనెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అయినా హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) అలాగే నటుడు సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) లు నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరూ ఈ సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఇద్దరికీ మొదటి తెలుగు పాన్ ఇండియా సినిమా కావడం ఇదే.అయితే ఈ సినిమా యూఎస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే.అయితే ఈ ప్రీ సేల్స్ లో అక్కడ ఊహించని రెస్పాన్స్ ఈ చిత్రానికి వచ్చింది.

ఇక లేటెస్ట్ గా దేవర ఐమ్యాక్స్ వెర్షన్( Devara Imax Version ) రిలీజ్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ దీనితో యూఎస్ మార్కెట్ లో అనౌన్స్ చేసి బుకింగ్ ఓపెన్ చేయగా వీటికి కూడా భారీ బుకింగ్స్ నమోదు చేసుకుంటుంది.

ఇలా మొత్తానికి అయితే ఓవర్సీస్ మార్కెట్ లో దేవర ప్రభంజనమే సృష్టించేలా ఉందని చెప్పాలి.ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ అరీస్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.అలాగే ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కాబోతుంది.

విడుదల తేదీకి మరొక 20 రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ నెమ్మదిగా ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు.అదేవిధంగా సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తున్నారు.

కాస్ట్యూమ్ విషయంలో హీరోయిన్‌ని దారుణంగా తిట్టిన డైరెక్టర్.. ఎవరంటే..
Advertisement

తాజా వార్తలు