వ్యాక్సిన్ పై భయాలు పొగొట్టిన బైడెన్.. లైవ్ లో వ్యాక్సినేషన్

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా ఉంది.పెద్ద పెద్ద దేశాలే ఈ వైరస్ దెబ్బకు కుదేలు అయ్యాయి.

అన్నీ దేశాలు కరోనా కు వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో ఉన్నాయి.ఇప్పటికే అమెరికా ఫైజర్ అనే కరోనా నిర్మూలనకు టీకాను తయారుచేసింది.

Joe Biden Taken Pfizer Vaccine , Joe Biden , Pfizer Vaccine ,Joe Biden Couple,

ఈ టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మొదటి డోస్ ను తీసుకున్నారు.ఆయన తీసుకుంటున్న మొదటి డోస్ టీకాను అమెరికా ఛానెల్స్ ప్రత్యేక్ష ప్రసారం చేశాయి.

ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ ఫైజర్ టీకా పై సందేహం వద్దు.టీకాను తీసుకోవడానికి అమెరికా ప్రజలు ముందుకు రావాలని కోరాడు.

Advertisement

అలాగే నేను రెండో దశ టీకాను తీసుకోవడానికి ఎదురుచూస్తున్నాను అన్నారు.ఫైజర్ వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్‌డి‌ఏ నుండి అనుమతి లభించింది.

ముందుగా ఈ టీకాను అమెరికా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మరియు ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు.జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఒక్కరోజు ముందుగా ఫైజర్ టీకాను వేసుకున్నారు.

కరోనా కారాణంగా మూడు లక్షలకు పైగా మృత్యువాత పడ్డారు.ఇకపై కరోనా ను నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో జో బైడెన్ ఈ టీకాను తీసుకున్నారు.

కరోనా నిర్మూలనకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని, గతంలోనే జో బైడెన్ చెప్పారు.అలాగే మరో రెండు రోజుల్లో క్రిస్మస్ వేడుకలు మొదలు కానున్నాయి కావున అందరు బౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించాలని జో బైడెన్ విజ్ఞప్తి చేశారు.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు