జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం( Gummanur Jayaram ) ఆ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో టిడిపిలో చేరిపోయారు.ఎప్పటి నుంచో జయరాం వైసిపి ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్నారని, పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతుండగా ఎట్టకేలకు ఆయన పార్టీ మారిపోయారు.
ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న జయరాం టిడిపిలో చేరడంతో వెంటనే మంత్రి పదవి నుంచి ఆయనను భర్తరఫ్ చేశారు.జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో గుమ్మనూరు జయరాం టిడిపి కండువా కప్పుకున్నారు.
ఆయనతో పాటు, ఆయన అనుచరులు చాలామంది టిడిపిలోకి చేరిపోయారు.వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు నుంచి జయరాంకు హామీ కూడా లభించడంతోనే ఆయన పార్టీ మారినట్లుగా ప్రచారం జరుగుతుంది.

గుమ్మనూరు జయరాం గుంతకల్లు నియోజకవర్గం( Guntakal Assembly constituency ) నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో, అక్కడ ఇప్పటి వరకు టికెట్ పై ఆశలు పెట్టుకుని, క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ తీవ్ర అసంతృతప్తితో ఉన్నారు.దీంతో జితేందర్ గౌడ్ వర్గీయులు ఆయనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు.వైసీపీ వద్దనుకున్న వ్యక్తి టిడిపికి ఎందుకు అంటూ ప్రశ్నిస్తూ.
జయరాం క వ్యతిరేకంగా జితేందర్ గౌడ్( Jithendar goud ) వర్గీయులు నినాదాలు చేశారు.

చంద్రబాబు తో పాటు ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా దూషించిన జయరాం ను పార్టీలోకి ఏ విధంగా ఆహ్వానించారని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు.జయరాం కనుక గుంతకల్లు టిడిపి అభ్యర్థిగా పోటీలోకి దిగితే.కచ్చితంగా ఓడించి తీరుతామని శపదాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇక్కడ చేలరేగిన అసంతృప్తిని చంద్రబాబు ఏ విధంగా చల్లారుస్తారు అనేది తేలాల్సి ఉంది.అలాగే ఇక్కడ టికెట్ పై ఆశలు పెట్టుకున్న జితేందర్ గౌడ్ ను ఏ విధంగా బుజ్జగించి శాంతింప చేస్తారో చూడాలి.