జియో నుంచి మరో సంచలనాత్మకమైన సర్వీసు

గత నెలరోజుల్లో జియో నంబర్స్ పై రిఛార్జ్ ఎంతమంది రిఛార్జీ చేసుకున్నారంటే, మిగితా అన్ని కంపెనీల యూజర్లందరిని కలిపినా, జియో దరిదాపుల్లో కూడా లెక్క ఉండదంట.ఈ విషయాన్ని ఇటివలే PAYTM బయటపెట్టింది.

 Jio To Enter Dth Services .. Design And Plan Leaked-TeluguStop.com

గత నెలరోజుల్లో జియో నంబర్స్ మీద 7 కోట్లకి పైగా రిఛార్జీలు జరిగాయంటే నమ్మగలరా? ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఆఫర్ అంటూ జియో ప్రైమ్ లో మొదటి రిఛార్జీ పైన 4 నెలలపాటు సర్వీసులు అందిస్తామని ప్రకటించింది జియో.దాంతో ఏయిర్ టెల్, ఐడియా … అందరి మార్కేట్ దివాళా తీసింది.4G నెట్వర్క్ లో రారాజుగా ఎదిగిన జియో మలి అడుగు DTH సర్వీసులవైపు మళ్ళింది.అక్కడ కూడా చౌకగా టిలివిజన్ ఛానెల్స్ ని అందించి, టీవి ప్రపంచాన్ని కూడా ఆక్రమించుకునే ఆలోచనల్లో ఉన్నాడు ముఖేష్ అంబానీ.

జియో సెట్ టాప్ బాక్స్ యొక్క డిజైన్ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది.ఇది ఒక IP బేస్డ్ సెట్ టాప్ బాక్స్.చిత్రంలో ఉన్నట్లుగా HDMI Port, USB Port, Ethernet Port మరియు ఆడియో,విడియో పోర్ట్స్ ఉన్నాయి.ఈ STB (సెట్ టాప్ బాక్స్) ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది.

అందుకే బాక్స్ కి Ethernet Port ఉంది.

-Top Posts Featured Slide

జీయో డిటీహెచ్ ద్వారా 350కి పైగా ఛానెల్స్ వస్తాయని వార్తలు వస్తున్నాయి.వారం రోజుల ముందు ఎపిసోడ్లు కూడా మనం వీలు ఉన్నప్పుడు చూసుకునే ఆప్షన్ ఉంటుందట.ఈ బాక్స్ యొక్క రిమోట్ లో మనం ఊహించని ఫీచర్స్ ఉండబోతున్నాయని కూడా సమాచారం.

ఇక మరో ముఖ్య విషయం ఏమింటే, నెలకి 800 రూపాయలు విలువ చేసే Netflix కంటెంట్ ని కూడా జియో డీటిహెచ్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.ఇక నెలకి ఈ ఐపిటీవి కనెక్షన్ ఎంత ఖర్చులో వస్తుంది అనే కదా మీ డౌటు .మనం ఊహిస్తున్న దాని కన్నా తక్కువ ఖర్చులోనే మనం జియో డీటిహెచ్ సేవలు పొందవచ్చు.ఇప్పుడున్న సెట్ టాప్ బాక్సుల సర్వీసుల కంటే 40%-50% తక్కువ ధరలకే జియో డిటిహెచ్ సేవలు అందుబాటులోకి వస్తాయని అంచనా.

ఇదే జరిగితే, ఇప్పుడు ఏయిర్ టెల్, ఐడియాల పరిస్థితి ఎలా తయారయ్యిందో, రేపు సన్ డైరెక్ట్, డిష్ టీవిల పరిస్థితి అలా తయారవుతుందేమో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube