2023లో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా ప్రవేశపెట్టిన బంపర్ ఆఫర్ ప్లాన్లు ఇవే!

2022ని విజయవంతంగా పూర్తి చేసుకొని కొత్త ఏడాదైన 2023ని కోటి ఆశలతో ప్రారంభించాం.

ఈ నేపథ్యంలో తమకి ఇష్టమైన టెలికాం సంస్థలు రాబోయే 365 రోజుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులోకి తెచ్చేసాయి.

అంటే.ఇక్కడ మీరు ఒకసారి రీఛార్జ్ చేస్తే.

ఏడాది పాటు ఎంజాయ్ చేయొచ్చు.ఈ దీర్ఘకాలిక ప్లాన్‌లలో అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ OTT ఆఫర్లను కూడా పొందవచ్చు.ముందుగా జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ ఒకసారి చూస్తే, రూ.2545 ప్లాన్ వుంది.ఈ రీఛార్జ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.దీనిలో భాగంగా 1.5Gb రోజువారీ డేటా బెనిఫిట్స్ సహా 504GB మొత్తం డేటా పొందవచ్చు అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ పొందుతారు.ఇపుడు ఎయిర్‌టెల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ ని ఒకసారి పరిశీలిస్తే, రూ.3359 ప్లాన్ అందుబాటులో వుంది.ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.బెనిఫిట్స్ ఏమంటే 2.5GB రోజువారీ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను పొందవచ్చు.అలాగే రూ.2999 ప్లాన్ తీసుకుంటే 2GB రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.వాటితో పాటు అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ ఇతరత్రా బెనిఫిట్స్ పొందవచ్చు.

వోడాఫోన్ ఐడియా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఒకసారి పరిశీలిస్తే.రూ.3099 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB రోజువారీ డేటా బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ తో అందుబాటులో వుంది.వినియోగదారులు అర్ధరాత్రి నుంచి అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ ఇందులో పొందుతారు.అలాగే ఇందులో రూ.2899 ప్లాన్ కూడా వుంది.దీనిని చేసుకుంటే యూజర్లు 1.5GB రోజువారీ డేటా బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను 365 రోజుల పాటు పొందవచ్చు.ఇంకా పూర్తి వివరాలు కావాలంటే సంబంధిత యాప్స్ చూడండి.

Advertisement
ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

తాజా వార్తలు