జియా ఖాన్( Jia Khan ).ఈ నటి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈమె 2007 లో నిశ్శబ్ద్ ( nishabd )అనే సినిమాతో బాలీవుడ్ ( Bollywood )లోకి పరిచయమై 2013 లో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.అయితే నిండా పాతికలు లేకుండానే తన జీవితాన్ని ముగించుకోవాలి అనుకోవడానికి ముఖ్య కారణం తనకు దక్కని ప్రేమ, సంతోషం మాత్రమే.
ఆమె కుటుంబం కోసం నటించాలి అనుకుంది, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే కొన్ని దారుణమైన కాస్టింగ్ కౌచ్ బాధలను భరించలేక సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలనుకుంది, వాస్తవానికి జీవితంలో ఇద్దరూ వ్యక్తులు ఆమె సుఖశాంతులను దూరం చేయడంతో పాటు ప్రాణం పోవడానికి కూడా కారణమయ్యారు.

ఆ ఇద్దరు మరెవరో కాదు ఆమె తల్లి రూబియా( Rubia ), ఆమె ప్రేమికుడు సూరజ్ పంచోలి( Suraj Pancholi ).జియా ఖాన్ తల్లి రూబియా పాకిస్తాన్ లో పుట్టింది కానీ పాకిస్తాన్ భారత్ వేరుపడినప్పుడు వారు ఇండియాకి వచ్చేశారు.ఇండియా వచ్చిన తర్వాత ఆమె కొన్ని సినిమాలు నటించింది.
కుటుంబ పోషణ కష్టం కావడంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన అందులో విఫలం అయింది.వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్ళింది కానీ అవి ఆమె కుటుంబ పోషణకు సరిపోలేదు.
చివరికి అమెరికా టెక్స్టైల్ ఇండస్ట్రీలో బాగా పేరు ఉన్న అలీ రిజ్వి ఖాన్( Ali Rizvi Khan ) అనే వ్యక్తి ఎదురు కట్నం ఇచ్చి మూడో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న టైంలో రూబియా తల్లిదండ్రులు ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేసి అప్పుల బాధ నుంచి బయటపడ్డారు.వారిద్దరికీ పుట్టిన అమ్మాయి ఈ జియా ఖాన్.

కానీ కొన్నాళ్లకు జియాఖాన్ తల్లిదండ్రులు విడిపోవడంతో మళ్లీ కుటుంబం పోషించడం కష్టం అయింది.దాంతో జియా ఖాన్ ని హీరోయిన్ చేయాలని ఆమె తల్లి రుబియా భావించింది.ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంటుందని సినిమా అంటే కమిట్మెంట్ ఉంటుందనే విషయం తెలీక ఆమె కూడా హీరోయిన్ కావాలని కలలు కంది.కానీ అందుకు రెడీగా లేనన్న విషయం కొద్ది రోజుల్లోనే అర్థమయింది.
జియా కు ఇలాంటి పనులు నచ్చవని తెలిసినా తల్లి డబ్బుల కోసం ఆమెను హీరోయిన్ చేయాలని చాలా ప్రయత్నించింది.బలవంత పెట్టింది కూడా.ఒకానొక టైం లో ఆమెను వదిలేసి వెళ్ళిపోయింది.చెప్పినట్టు వింటే తప్ప రాను అంటూ బెదిరించింది.
అలాంటి తప్పని పరిస్థితుల్లో హౌస్ ఫుల్ సినిమాలో నటించింది.గజినీలో కూడా తల్లి వల్లే పాత్ర వచ్చింది.
అయినా కూడా కమిట్మెంట్ ఇవ్వలేక కాస్టింగ్ కౌచ్ బారిన పడి బతకలేక తల్లి చెప్పినట్టు వినలేక తనువు చాలించింది.ఈ మధ్యలో ప్రేమ వివాహం కూడా ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
దాంతో జియాఖాన్ ప్రాణాలు తీసుకుంది.







