జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తారా ? అందుకే అలా అన్నారా ? 

మొన్నటివరకు బీఆర్ఎస్( BRS ) నుంచి కాంగ్రెస్ లోకి వలసలు తీరం అయ్యాయి.

చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోగా,  మరి కొంతమంది వెయిటింగ్ లో ఉన్నారు.

  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం,  బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.  అయితే ఇటీవల కాలంలో ఈ చేరికల హడావుడి పెద్దగా కనిపించడం లేదు.

ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు ఎంతోమంది కాంగ్రెస్( Congress ) లో చేరికపోగా,  దానికి రివర్స్ గా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు బీఆర్ఎస్ లో చేరే ఆలోచనతో ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది.దీనికి తగ్గట్లు గానే సదరు నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు దానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.

Advertisement

ఇప్పటికే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ( MLA Sanjay Kumar )కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగుతున్నారు. పైకి మాత్రం తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే  చెప్పుకుంటున్నారు.అయితే సంజయ్ రాకపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్న జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( MLC Jeevan Reddy ) ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు .అదీ కాకుండా జీవన్ రెడ్డి అనుచరుడు గంగిరెడ్డి హత్యతో ఆయన కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు తీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది .ఈ క్రమంలోనే ఆయన బిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా కవిత కేటీఆర్ పై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. చాలామందికి వారసులు ఉన్నారు కానీ , ఎవరికి కలిసి రాలే , కానీ కెసిఆర్ కి కలిసి వచ్చింది.వారసత్వం కేసీఆర్ ఇస్తే వచ్చింది కాదు.

  కేటీఆర్ కవిత వాళ్ళు ఇంటిలిజెంట్స్ .ఎవరు అవునన్నా కాదన్నా అంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతారని,  అందుకే బీఆర్ఎస్ అగ్ర నేతలపై ఈ విధంగా ప్రశంసలు కురిపిస్తున్నారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్
Advertisement

తాజా వార్తలు