సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ(VV Lakshminarayana ) కొత్త పార్టీ ప్రకటన చేయడం జరిగింది.తన పార్టీ పేరు “జై భారత్ నేషనల్ పార్టీ” అని ప్రకటించారు.
ఇది పుట్టుకొచ్చిన పార్టీ కాదని ప్రజల నుండి వచ్చిన పార్టీ అని స్పష్టం చేశారు.ఈ పార్టీ పెట్టక ముందు అన్ని వర్గాల ప్రజలను కలిసి అభిప్రాయాలను తీసుకోవడం జరిగిందని అన్నారు.
ప్రత్యేక హోదా సాధించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు.ఇదే సమయంలో తాము ఎవరికి తలవంచబోమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని పేర్కొన్నారు.
ఇతర పార్టీల మాదిరిగా తప్పులు చేయమని.
బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తామని వ్యాఖ్యానించారు.అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తాం.
అవినీతిని అంతమొందిస్తాం.యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.
రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకెళ్తామని పార్టీ ఆవిర్భావ సభలో జేడీ లక్ష్మీనారాయణ ప్రసంగించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటన సంచలనంగా మారింది.2019 ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం( Visakhapatnam ) ఎంపీగా పోటీ చేశారు.కానీ ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేయడం జరిగింది.ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రైతులతో ఇంకా విద్యార్థులతో రకరకాల ప్రజలతో సమావేశాలు నిర్వహించారు.ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా “జై భారత్ నేషనల్ పార్టీ( Jai Bharath National Party )” అంటూ కొత్త పార్టీ ప్రకటించడం జరిగింది.