ఏపీ ఆప్ అధ్యక్షుడుగా జేడీ..?

ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడదామని భావిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తోందని తెలుస్తోంది.ఆప్ పార్టీకి ప్రత్యక్షంగా ఏపీ నేతలతో సంబంధాలు లేకపోవడంతో.

 Jd As Ap Aap President,cm Kcr, Cm Kekriwal, Cm Jagan, Jd Laxminarayana, Brs Mla-TeluguStop.com

బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.ఇప్పటికే చాలా మంది నేతలతో అటు బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగిన దగ్గరి నుంచి ఏపీలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేయలేదు.ఇక దానిక కోసం ఏపీ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కు సీఎం కేసీఆర్ భారీ టీర్గెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Telugu Ap Brs, Brs Aap, Brs Mla Vivek, Cm Jagan, Cm Kcr, Cm Kekriwal-Politics

ఆ తతంగం అటుంచితే.ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ విశాఖలో జేడీ లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు.ఆయన్ను బీఆర్ఎస్ తరపున ఆప్ పార్టీలో చేరమని అడిగినట్టు సమాచారం అందుతోంది.బీఆర్ఎస్ పార్టీలోకి కాకుండా ఆప్ పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా పార్టీ అధిష్టాన పగ్గాలు కూడా ఆయనకు ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరో వైపు ఎమ్మెల్యే వివేక్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావుతోనూ భేటీ అయ్యారు.ఆయన్ను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

Telugu Ap Brs, Brs Aap, Brs Mla Vivek, Cm Jagan, Cm Kcr, Cm Kekriwal-Politics

ఓకే మీటింగ్ లో ఒక నేతను బీఆర్ఎస్ పార్టీలోకి మరో నేతను ఆప్ పార్టీలోకి చేరమని అడగడం చూస్తుంటే.కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలను గల్లీ స్థాయిలోనూ భుజాల వేసుకున్నట్టు తెలుస్తోంది.ఏపీలో ఆప్ పార్టీకి సాయం అందిస్తే ఆయన తనకు ఢిల్లీలో బాసటగా ఉంటారని భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా నికార్సైన అధికారిని ఏపీ అధ్యక్షుడిగా నియమించడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఒక వేళ జేడీ లక్ష్మీనారాయణ ఆప్ పగ్గాలు చేపడితే మాత్రం రాష్ట్ర రాజకీయం రంజుగా మారుతుందని.విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube