వామ్మో ఈ హింసను నేను భరించలేను జేసీ దివాకర్‌రెడ్డి

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించే ప్రయత్నం జగన్‌ సర్కార్‌ చేస్తోందని ఆయన విమర్శించారు.

ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.ఈ వేధింపుల భరించలేక తాను తన ట్రావెల్స్ బిజినెస్‌ను కొంతకాలం పాటు నిలిపేస్తానని చెప్పడం గమనార్హం.

Jc Diwakar Reddy Comments On Jagan Mohan Reddy

జగన్‌ వైఖరి కారణంగా రానున్న ప్రభుత్వంలోని వాళ్లు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే అరాచకానికి అసలు హద్దే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.వచ్చే సీఎం మంచి వాళ్లయినా, చెడ్డ వాళ్లయినా ఎమ్మెల్యేలు అరాచకానికి దిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ప్రభుత్వ ఒత్తిడి వల్లే కొందరు అధికారులు తనను వేధింపులకు గురి చేయడానికి ప్రయత్నించారని వెల్లడించారు.

అధికారులపై ఎదురు కేసులు పెడతానని బెదిరించడంతో ఈ విషయం బయటపడిందని జేసీ తెలిపారు.

Jc Diwakar Reddy Comments On Jagan Mohan Reddy
Advertisement
Jc Diwakar Reddy Comments On Jagan Mohan Reddy-వామ్మో ఈ హిం

జగన్‌ వచ్చాక మార్పు రావడం తప్ప కొత్తగా చేసి చచ్చింది ఏమీ లేదని తనదైన రీతిలో ఆయన విమర్శించడం విశేషం.అనవసరంగా ఎమ్మెల్యేల్లో ఇలాంటి అరాచకాలను పెంచి పోషించడం సరి కాదని జేసీ అభిప్రాయపడ్డారు.అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని జగన్‌కు హితవు పలికారు.

ఇక టీడీపీ నుంచి వెళ్తున్న వాళ్లు ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి చేస్తున్నారంతే అంటూ ఆయన తేలిగ్గా తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు