ఆ వ్యక్తిని ఇప్పటికి ప్రేమిస్తూనే ఉన్నాను : జయ మాలిని

జయమాలిని.క్లబ్ డ్యాన్సర్ అని, ఐటెం గర్ల్ అని, శృంగార నర్తకి అని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు.

ఆమె ఎనభై దశకం లో బాగా బిజీ నర్తకి.జయ మాలిని అంటే అప్పట్లో యూత్ పడి చచ్చిపోయే వారు.

ఆమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీలో చాల సినిమాల్లో శృంగార గీతాలకు నర్తించడం తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించారు.జయమాలిని బిజీ గా ఉన్న టైం లో చాల మంది ఆమెకు ప్రేమ లేఖలు రాసేవారట.

అలాగే పెళ్లి చేసుకుంటామని కూడా ప్రపోజల్ పెట్టేవారట.

Advertisement

ఆమె కు వచ్చే ప్రేమ లేఖలు చదవడానికి కూడా సమయం లేనంత బిజీ గా సౌత్ ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తూ ఉండేవారట.అందుకే జయ మాలిని కి వచ్చే ప్రేమ లేఖలు అలాగే అభిమానులు పంపే ఉత్తరాలను చదవడానికి ఒక మేనేజర్ ని ఏర్పాటు చేసిందట వాళ్ళ అమ్మ.ఇక ఇన్ని లక్షల, కోట్ల మంది అభిమానం సంపాదించుకున్న జయ మాలిని మాత్రం అప్పుడే హీరో గా వస్తున్న ఒక నటుడిని బాగా ఇష్ట పడిందట.

అతడిని మౌనంగానే ప్రేమించింది.ఎప్పుడు ఆ హీరో పై ప్రేమను వ్యక్తం చేయలేదట.జయమాలిని ని సైతం ఆ హీరో ప్రేమించాడట.

ఒక రోజు నిద్ర పోతున్న జయ మాలిని కి లవ్ ప్రొపోజల్ చేసి వెళ్ళిపోయాడట.కానీ ఏవో కారణాల చేత జయమాలిని మాత్రం అతడికి బదులు చెప్పలేకపోయింది.ఇప్పటికి కూడా ఆ హీరోను పిచ్చిగా ఆరాధిస్తున్నన్ని, తాను కన్ను మూసే లోపు అతడికి తన ప్రేమను చెప్తానని ఇటీవల ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పటికి ఆ హీరో అంటే తనకు చాలా ఇష్టమని, ఆ ప్రేమను, భారాన్ని చాల ఏళ్లుగా మోస్తున్న అంటూ జయ మాలిని చెప్పారు.కానీ ఆ హీరో ఎవరు అనే విషయం మాత్రం ఆవిడా చెప్పడానికి ఇష్టపడలేదు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

ఇక జయ మాలిని తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోక పోయిన తనను పెళ్లి చేసుకున్న భర్త మాత్రం బాగానే చేసుకుంటున్నాడని చెప్పుకోచ్చింది.

Advertisement

తాజా వార్తలు