తెలుగు సినిమా పరిశ్రమతో పాటు అన్ని పరిశ్రమల్లో కూడా కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తుతం ప్రముఖంగా చర్చించుకుంటున్నారు.కొత్త వారికి అవకాశాలు రావాలి అంటే పాతవారి కోరికలు తీర్చాలి ఉంటుంది.
దీనికి వాడే పదమే కాస్టింగ్ కౌచ్.ఈమద్య కాలంలో ఎక్కువ మంది హీరోయిన్స్ మరియు నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
తాజాగా సీనియర్ హీరోయిన్ జయప్రద కూడా కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.తనకు ఆ అనుభవం ఎదురు కాలేదు కాని, కొత్త వారు కాస్టింగ్ కౌచ్‌కు బలి అవుతున్నారు అంటూ జయప్రద చెప్పుకొచ్చారు.
సినిమాల్లో రాణించాలే ఉద్దేశ్యంతో తమకు ప్రతిభ ఉందా లేదా అనే విషయాన్ని గుర్తించకుండా అవకాశాల కోసం కొందరు నిర్మొహమాటంగా తమను తాము అర్పించేందుకు సిద్దం అవుతున్నారు అని, మోడ్రన్ లైఫ్‌లో ఇవన్ని కామన్ అని కొంత మంది భావిస్తున్నారు.ముఖ్యంగా ఉత్తరాది అమ్మాయిలు అందునా ముంబయి అమ్మాయిలు తమ అవసరాల కోసం, సినిమాల్లో ఛాన్స్‌ల కోసం కాస్టింగ్ కౌచ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ జయప్రద చెప్పుకొచ్చింది.
బాలీవుడ్‌లో నటించిన అనుభవం తనకు ఉన్నది కనుక ఈ విషయం చెబుతున్నట్లుగా ఆమె పేర్కొంది.

టాలీవుడ్‌లో కొందరు ముంబయి హీరోయిన్స్ ఈ పద్దతికి శ్రీకారం చుట్టారని, అదే పద్దతిని దర్శక నిర్మాతలు కొనసాగిస్తున్నారు అంటూ జయప్రద చెప్పుకొచ్చారు.సినిమాల్లో మొదటి అవకాశం చాలా కష్టంగా వస్తుందని, ఆ అవకాశం వచ్చిన తర్వాత తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది.అప్పుడు నిరూపించుకోలేకుంటే కాస్టింగ్ కౌచ్‌కు బలి అవ్వక తప్పదు అంటూ జయప్రద చెప్పుకొచ్చారు.
ఎప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఈ పద్దతి అనేది కొనసాగుతూనే ఉంటుందని, దాన్ని ఎవరు మార్చలేరని, హీరోయిన్ అవకాశాల కోసం వచ్చే వారు తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది తగ్గుతుందని తాను భావిస్తున్నట్లుగా జయప్రద అన్నారు.
ప్రతిభ ఉంటే ఎలాంటి వారికి లొంగవల్సిన అవసరం లేదని, కొన్ని బలహీన క్షణాలు వస్తాయని, వాటిని ధైర్యంతో ఎదుర్కొనే సత్తా, దమ్ము ఉన్న వారు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనేది అమ్మాయిలకు జయప్రద ఇచ్చే సూచన.