సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంత అందంగా, గ్లామర్ గా ఫిట్నెస్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే.వారు అలా అంత ఫిట్ గా అందంగా కనిపించడం కోసం రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
కానీ చాలామంది అభిమానులకు ఆ విషయాలు ఏవి సరిగా తెలియవు.హీరోయిన్ల కేంటి అంత అందంగా ఉన్నారు.
వాళ్లకు ఎటువంటి సమస్యలు రావు అని అనుకుంటూ ఉంటారు.కానీ అలా అనుకుంటే పొరపాటు పడినట్లే.
ఎందుకంటే పైకి అందంగా నవ్వుతూ కనిపించే హీరోయిన్ లు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే ఆ విషయాలు బయటపడుతూ ఉంటాయి.ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోలు అలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడిన విషయం తెలిసిందే.ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మరో ముద్దుగుమ్మ కూడా ఇలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.
ఆమె మరెవరో కాదు నటి సన్య మల్హోత్రా( Actress Sanya Malhotra ).ఇటీవలె ఈమె జవాన్ మూవీ( Jawan Movie )తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.తాజాగా ఈమె తనకున్న రోగం గురించి చెప్పుకొచ్చింది.దీని వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో కూడా రివీల్ చేసింది.
తాను చాలాకాలంగా ఇంపోస్టర్ సిండ్రోమ్( Imposter Syndrome Disease ) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది.
దీనికారణంగా ఆత్మన్యూనతకి గురవుతున్నట్లు అనిపిస్తుందని ఆమె తెలిపింది.నా యాక్టింగ్ గురించి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నా బాగా చేశావని అంటున్నా సరే నాకు సందేహంగానే అనిపిస్తుంది.బాగా చేయాలేదేమో అని అనుమానం కలుగుతుంది.
అలానే నేను చేసే పని కూడా నచ్చదు.బదాయి హో సినిమా( Badhaai Ho ) హిట్ అయింది.
కానీ నేను మాత్రం బాగా యాక్ట్ చేయాలేదని ఫీల్ అయ్యాను.అయితే ఈ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాను అని సన్య మల్హోత్రా చెప్పుకొచ్చింది.