ఈ ప్రపంచంలో ఎన్నో చిత్ర విచిత్రమైన రెస్టారెంట్స్ ఉన్నాయి.వాటిలో కొన్ని రెస్టారెంట్స్( Restaurants ) షాకింగ్ సర్వీసులు ఆఫర్ చేస్తూ నోరెళ్లబెట్టేలా చేస్తాయి.
తాజాగా ఇలాంటి మరొక చిత్రమైన రెస్టారెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ రెస్టారెంట్లో డబ్బులు ఇచ్చి మరీ కస్టమర్లు కిమోనో ధరించిన వెయిట్రెస్‌లచే( Waitresses ) ముఖం మీద చెంపదెబ్బ కొట్టించుకుంటారు.జపాన్‌లోని నాగోయాలో ఉన్న షాచిహోకో-యా( Shachihoko-ya ) అనే రెస్టారెంట్ ఈ సేవ ఆఫర్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
300 యెన్లకు (సుమారు రూ.170) చెల్లించే ఈ రెస్టారెంట్‌లో ‘నగోయా లేడీస్ స్లాప్’ని( Nagoya Lady’s Slap ) అనుభవించవచ్చు.అదనంగా 500 యెన్ (రూ.283) కోసం వారు స్లాప్‌ను అందించడానికి సిబ్బందిని ఎంచుకోవచ్చు.ఈ అసాధారణమైన ఆఫర్ స్థానిక ప్రజలనే కాకుండా అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించింది.చాలా బలంగా చెంప దెబ్బ( Face Slapping ) కొట్టిన తర్వాత కూడా కస్టమర్లు మరింత రిలాక్స్‌గా ఫీలవుతారని లోకల్ మీడియా నివేదించింది.
ఈ అనుభవం తర్వాత కృతజ్ఞతలు కూడా తెలుపుతారట.కానీ వైరల్ వీడియోలో చూస్తుంటే ఏదో పగ పట్టినట్టు రెస్టారెంట్ సిబ్బంది చెంప మీద కొట్టినట్లుగా కనిపిస్తోంది.

2012లో ప్రారంభమైన ఈ సర్వీస్‌లో మొదట ఒక రెస్టారెంట్ లేడీ ఎంప్లాయ్ మాత్రమే చెంపదెబ్బలు కొట్టేది.అయితే ఈ చెంప దెబ్బలకు పాపులారిటీ పెరిగిపోవడంతో రెస్టారెంట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎక్కువ మంది మహిళలను నియమించుకుంది.ఈ ఫేస్-స్మాకింగ్ సర్వీస్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి, ఇంటికి చాలా వ్యూస్ కూడా వచ్చాయి దీనిని చూసి చాలామంది షాక్ అవుతున్నారు.డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం ఏంటి? వింతగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

అయితే, ఇటీవలి వైరల్ వీడియోలు ఈ సర్వీసు తాత్కాలికంగా నిలిపివేయడానికి దారితీశాయి.షాచిహోకో-యా ట్విట్టర్‌లో తాము ఇకపై స్లాప్‌లను( Slaps ) అందించడం లేదని ప్రకటించింది.సందర్శకులు ఈ సేవను ఆశించవద్దని సూచించింది.రెస్టారెంట్ పాత వీడియోలకు ప్రస్తుతం వస్తున్న పాపులారిటీని చూసి రెస్టారెంట్ యాజమాన్యం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.అయితే ‘నాగోయా లేడీస్ స్లాప్’ తిరిగి వస్తుందా లేదా అది శాశ్వతంగా నిలిపివేయబడిందా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.







