మనం తినడానికి అనేక వెరైటీ ఆహార పదార్థాలు ఉంటాయి.అలాగే కొంతమంది విభిన్న రకాలుగా ట్రై చేస్తూ వెరైటీ ఐటమ్స్ తయారుచేస్తూ ఉంటారు.
కొత్త రకాల వంటకాలు ట్రై చేస్తూ అందరికీ రుచి చూపిస్తూ ఉంటారు.సోషల్ మీడియాలో ఇలాంటి వెరైటీ ఫుడ్ వంటకాలు వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే రైతులు వివిధ రకాల ప్రయోగాలు చేసి సరికొత్త వంగడాలను సృష్టిస్తూ ఉంటారు.తాజాగా జపాన్ హార్టికల్చర్ రైతులు అదే పని చేశారు.
లెమన్ మిలన్( Lemon Milan ) అనే సరికొత్త వంగడాన్ని సృష్టించారు.
తీపి, పులుపు కలగలిపిన సమ్మేళనాలతో మంచి రుచిని అందించే లెమన్ మిలన్ అనే టేస్టీ ఫ్రూట్‌ను అభివృద్ది చేశారు.
జపాన్( Japan ) కు చెందిన సంటరీ ఫ్లవర్స్ హార్టికల్చర్ కంపెనీ నిపుణులు దీనిని తయారుచేశారు.ఈ ఫ్రూట్ తయారుచేడానికి దాదాపు వారికి ఐదేళ్ల సమయం పట్టిందట.
పుచ్చకాయ నుంచి లెమన్ మిలన్ ను సృష్టించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టి సక్సెస్ అయ్యారు.నిమ్మకాయతో మిళితం చేయబడిన ఈ ఫ్రూట్ పుచ్చకాయలా స్వీట్ గా ఉంటుంది.
ఈ సరికొత్త ఫ్రూట్ గుండ్రని ఆకారంలో ఉంటుంది.పైన కనిపించే తొక్కలో పుచ్చకాయ తరహాలో చారలు ఉండవు.
తెల్లటి ప్లెష్ లాంటి పదార్థం ఉంటుంది.హక్కైడో అనే ప్రాంతంలో ఐదుగురు రైతులు( Farmers ) ) ఈ సరికొత్త ఫ్రూట్ ని పండిస్తున్నారు.
వారి పంటతో దాదాపు 3,800 లెమన్ మిలన్స్ ఉత్పత్తి కానున్నాయి.టేస్టీగా ఉండే ఈ లెమన్ మిలన్ ను తినేందుకు అక్కడ చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
రానున్న రోజుల్లో మరింతగా ఈ ఫ్రూట్ ను ఉత్పత్తి చేసేలా శాస్త్రవేత్తలు రైతులతో మాట్లాడుతున్నారు.ఇతర దేశాలకు కూడా వీటిని ఎగుమతి చేయాలని చూస్తున్నారు.