జపాన్‌లో క్రైమ్ రేట్( Japan Crime Rate ) చాలా తక్కువ అనే విషయం తెలిసింది.మొత్తం ప్రపంచంలో తక్కువ క్రైమ్ రేట్ ఉన్న కొన్ని దేశాలలో జపాన్( Japan ) ఒకటి.
డెవలప్డ్ కంట్రీ అయినా కూడా ఇక్కడ నేరాలు అతి తక్కువగా జరుగుతుంటాయి.దానికి కారణం పౌరులే అన్నట్లు తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఒక పౌరుడు క్రిమినల్‌ను అతడు తొడుక్కున్న బెల్టు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో వేయడం కనిపించింది.
పౌరులు ఇలా ధైర్యంగా క్రిమినల్స్ ను ఎదుర్కోవడం వల్లే జపాన్‌లో నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందన్నట్లు వైరల్ వీడియోకి ఒక క్యాప్షన్ జత చేశారు.
ఈ వైరల్ వీడియోను బెస్ట్ క్లిప్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక క్రిమినల్‌ను( Criminal ) ఒక పౌరుడు బెల్టు పట్టుకొని రోడ్డుమీద లాక్కెళ్ళడం మనం చూడవచ్చు.

ఆ సమయంలో క్రిమినల్ ప్రతిఘటించకుండా అలానే నేలపై రాసుకుంటూ పోతున్నాడు.వెనక ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యాలను ఫోన్ కెమెరాలో రికార్డు చేస్తూ వారిని ఫాలో అయ్యాడు.చివరికి ఆ క్రిమినల్ ను పోలీస్ స్టేషన్( Police Station ) ముందు విసిరేశాడు.పోలీస్ వెంటనే అతడిని పట్టుకున్నాడు ఆపై చంటి పిల్లాడిని లేపినట్టు తన రెండు చేతులతో పైకి లేపి నిల్చబెట్టాడు.
అంతటితో వీడియో ముగిసింది.

ఈ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు జపాన్ లాగా తమ దేశం కూడా మారాలని కోరుకుంటున్నారు.కొద్ది గంటల క్రితమే షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 10 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







