సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయడం అమ్మడం సర్వసాధారణం.ఇలా ఎంతోమంది వారికి నచ్చిన కొత్త ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పాత ఇంటిని అమ్మడం చేస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా నటి జాన్వీ కపూర్ తన ఫ్లాట్ అమ్మినట్టు తెలుస్తోంది.ముంబైలోని జుహు ప్రాంతంలో ఎంతో ఖరీదైన విలాసవంతమైన ఫ్లాట్ రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసింది.
జాన్వీ 2020 డిసెంబర్ నెలలో 39 కోట్ల రూపాయల పెట్టి ఈ ఫ్లాట్ సొంతం చేసుకున్నారు.
ఇలా ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన జాన్వీ కపూర్ తాజాగా ఆ ఇంటిని అమ్మినట్టు తెలుస్తుంది.
జాన్వీ ఇంటిని బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు సొంతం చేసుకున్నారు.రాజ్ కుమార్ నటి జాన్వీ కపూర్ ఇంటిని ఏకంగా 44 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు.3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఇంటిని అమ్మడంతో జాన్వీ కపూర్ ఏకంగా ఐదు కోట్ల రూపాయల లాభం పొందినట్లు తెలుస్తోంది.

ఇక ఈ అపార్ట్మెంట్ భవనాన్ని బాలీవుడ్ నిర్మాత బిల్డర్ ఆనంద్ పండిట్ నిర్మించారు.ఈ భవనాన్ని లోటస్ ఆర్య అని కూడా పిలుస్తారు.ఇలా ఎంతో విలాసవంతమైన ఈ ఇంటిని రెండు సంవత్సరాల క్రితం జాహ్నవి కపూర్ కొనుగోలు చేయగా ప్రస్తుతం తన నుంచి నటుడు రాజకుమార్ రావు సొంతం చేసుకున్నారు.
అయితే ఇలా ఇండస్ట్రీలో నటీనటులు కొత్త ఫ్లాట్లు కొనుగోలు చేయడం పాతవి అమ్మడం చేస్తుంటారు.ఈ క్రమంలోనే జాన్వి కపూర్ సైతం తన ఫ్లాట్ కి భారీ డీల్ రావడంతో అమ్మినట్లు తెలుస్తోంది.







