ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో త్వరలో ప్రారంభం కాబోతున్న చిత్రం జనతా గ్యారేజ్.శ్రీమంతుడు చిత్రంతో ఘనంగా బోణి కొట్టిన మైత్రి మూవీ మేకర్స్ .
ఈ సినిమాను నిర్మించబోతున్నారు.ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనుండటం విశేషం.
అందుకే ఈ చిత్రానికి తెలుగులోనే కాదు, మలయాళంలో కూడా పిచ్చి క్రేజ్ ఉంది.
ఇక ఈ చిత్రం యొక్క కేరళ హక్కులు 4.2 కోట్లకు అమ్ముడుపోయాయి.ఒక తెలుగుసినిమా ఇంత రేటుకి అక్కడ అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి.
ఇంతకుముందు ఈ రికార్డు బాహుబలి పేరిట ఉండేది.ఆ చిత్రం 3.25 కోట్లకు అమ్ముడుపోయింది.మోహన్ లాల్ సినిమాలో ఉండటం ఈ బిజినెస్ కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.అయితే కేరళలో అత్యధిక కలెక్షన్లు సాధించింది బాహుబలి.14.5 కోట్ల గ్రాస్ సాధించిన బాహుబలిని జనతా గ్యారేజ్ దాటుతుందో లేదో చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో జనతా గ్యారేజ్ కి చాలా డిమాండ్ ఉంది.
టెంపర్, నాన్నకు ప్రేమతో హిట్లతో ఎన్టీఆర్ కూడా ఫామ్ లోకి వచ్చేయడం, కొరటాల వెనుకాలా శ్రీమంతుడు,మిర్చి లాంటి భారి బ్లాక్బస్టర్స్ ఉండటంతో ఎగబడి కొనేస్తున్నారు పంపిణిదారులు.ఇదే నెలలో మొదలయ్యే ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.







