జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయనను మీట్ అయ్యేందుకు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం.
అపాయింట్ మెంట్ దొరికితే సాయంత్రం పవన్ కల్యాణ్ గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.గత రెండు రోజుల్లో విశాఖలో చోటు చేసుకున్న ఘటనలతో పాటు జన సైనికుల అరెస్టులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
అయితే, ప్రస్తుతం బెంగళూరులో ఉన్న గవర్నర్ బీబీ హరిచందన్.మధ్యాహ్నానికి విజయవాడకు చేరుకుంటారు.