అన్న పార్టీ నేతల కోసం.. తమ్ముడి ఆరాటం ?

జనసేన పార్టీని ఏదోరకంగా బలోపేతం చేసి 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి అనే తాపత్రయం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లో ఎక్కువగా కనిపిస్తుంది.పొత్తులతో అయినా, ఒంటరిగా అయినా జనసేన ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు.

 Janasena Pawan Kalyan Wnats To Join Prajarajyam Paty Candidates  Janasena, Pava-TeluguStop.com

దీనికోసం రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు.ప్రస్తుతం ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే ప్రజా సమస్యల విషయంలో పోరాటాలు చేస్తూ, ఏదో ఒక కార్యక్రమం ద్వారా జనాల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు.అయితే ఆశించిన స్థాయిలో జనసేన లేకపోవడం పవన్ కు నిరాశ కలిగిస్తోంది.

ఈ క్రమంలోనే తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేసిన ప్రజారాజ్యం పార్టీ నేతలు పవన్ ను టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు.

         ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత చాలామంది నాయకులు ఇతర పార్టీల్లో చేరిపోయారు.2014 ఎన్నికల్లో పవన్ జనసేన పార్తీని ఎన్నికల బరిలోకి తీసుకు వెళ్తే, ప్రజారాజ్యం లో కీలకంగా వ్యవహరించిన నాయకులు వచ్చి చేరేవారు.కానీ అప్పుడు టిడిపి, బిజెపి లకు పవన్ మద్దతు ఇచ్చి జనసేన ను ఎన్నికలకు తీసుకువెళ్లకపోవడంతో, ఇతర పార్టీల్లో వారంతా చేరిపోయి కీలక పదవుల్లో ఉన్నారు.

దీంతో 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసినా.ఆయా పార్టీల్లో ఉన్న ప్రజారాజ్యం మాజీ నాయకులు జనసేన వైపు రాలేకపోయారు.అయితే 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కృషి చేస్తున్న పవన్ పార్తీని బలోపేతం చేసే విషయం పై దృష్టి సారించారు.దీంతో ఇప్పుడిప్పుడే పార్టీలో మంచి ఊపు కనిపిస్తోంది.

దీంతోపాటు పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటే.జనసేనకు అధికారం దక్కడం పెద్ద కష్టమేమీ కాదు అనే అభిప్రాయంతో ఉన్న పవన్ పాతతరం ప్రజారాజ్యం పార్టీ నాయకులను జనసేన లోకి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారట.       

Telugu Janasena, Janasenani, Pavan Kalyan, Prajarajyam, Ysrcp-Politics

 ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత చాలామంది తటస్థంగా ఉండిపోయారు.ఇప్పుడు అటువంటి నాయకులను జనసేన లోకి ఆహ్వానించాలని,  అలాగే ఇతర పార్టీల్లో ఉన్న మెగా అభిమానులను జనసేనలోకి తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట.ఇప్పుడు మాజీ ప్రజారాజ్యం నేత , కాపు సామాజిక వర్గం లో కీలక నాయకుడిగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ ను ఇప్పుడు జనసేన లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే మిగతా ప్రజారాజ్యం నాయకులను జనసేన లోకి తీసుకువచ్చే విధంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube