పొత్తులు స‌రే.. పార్ల‌మెంట్ స్థానాల‌పై దృష్టి పెట్ట‌క‌పోతే ప‌ట్టు దొర‌కుతుందా..?

ఏపీలో జ‌న‌సేన పుంజుకుంటున్న‌ప్ప‌టికీ ఓన్లీ అసెంబ్లీ సీట్ల‌పేనే ఫోక‌స్ చేస్తున్నారు త‌ప్పితే పార్ల‌మెంట్ సీట్ల‌పై దృష్టిపెట్ట‌డం లేద‌ని అంటున్నారు.అసెంబ్లీ స్థానాల‌పై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించ‌డం లేద‌ని అంటున్నారు.

 Janasena Pawan Kalyan Not Focusing On Parliament Seats Details, Pawan Kalyan, Ja-TeluguStop.com

అలాంటిది ఎంపీ సీట్ల‌పై ఊసే లేద‌ని అంటున్నారు.అన్ని పార్టీల‌కు ముఖ్యంగా ఎంపీ సీట్లు చాలా ముఖ్యం.

కేంద్రంలో గౌరవం ఉండాల‌న్నా.జాతీయ పార్టీల‌తో క‌లిసిపోవాల‌న్నా ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు ఉండాల్సిందే.

అయితే జ‌న‌సేన ఆ దిశ‌గా ఏమాత్రం దృష్టి పెట్ట‌డం లేద‌ని అంటున్నారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కాని, టీడీపీతో కాని పొత్తు పెట్టుకోవాలనుకున్నా పార్లమెంటు స్థానాలకు సరైన అభ్యర్థులు అవసరం.

కానీ ఆ దిశగా జనసేనాని ఆలోచించడం లేదు.

ఎంపీ సీట్లు ఎంత ముఖ్యం అంటే.

ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కాలు మోపలేకపోవడానికి మూడు సీట్లు రావడమే కారణం అని చెప్పాలి.అయితే జనసేన లాంటి పార్టీలకు కేంద్రం నుంచి సహకారం కావాలన్నా, ఢిల్లీ స్థాయిలో గుర్తింపు రావాలన్నా పార్లమెంటు స్థానాల్లో గెలుపు అవసరం చాలా ముఖ్యం.

అయితే ఇప్పటి వరకూ జనసేన ఆ దిశగా దృష్టి పెట్టినట్లు కన్పించడం లేదు.కేవలం కొన్ని జిల్లాల్లోనే అదీ శాసనసభ నియోజకవర్గాలపైనే పవన్ ఫోకస్ పెట్టారు.అంతే తప్ప అసలు పార్లమెంటు స్థానాల గురించి పట్టించుకోవడం లేదు.

అస‌లు ఆ ఆలోచ‌న ఉందా.?

Telugu Ap, Cm Jagan, Janasena, Janasenapawan, Janasenatdp, Pawan Kalyan-Politica

అయితే ఇంకా రెండేళ్లు సమయం ఉందని పెద్దగా పట్టించుకోవడం లేదా.? అసలు పార్లమెంటు నియోజకవర్గాలు తమకు అవసరం లేద‌ని భావిస్తోందా.అన్న‌ది కూడా అర్థం కావ‌డం లేదు.సహజంగా పార్లమెంటుకు పోటీ చేసే నేతలు ఆర్థికంగా దండిగా ఉండాలి.రిజర్వడ్ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్లమెంటు పరిధిలోని శానసనభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకోవ‌డం తెలిసిందే.అయ‌తే పార్టీ త‌ర‌ఫున పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక సాయం కూడా ఉండ‌దు.అందుకు సామాజికవర్గం కూడా కొంత పనిచేస్తుంది.

పొత్తులున్నా.త్యాగాలు సాధ్య‌మా.?

Telugu Ap, Cm Jagan, Janasena, Janasenapawan, Janasenatdp, Pawan Kalyan-Politica

ఇక జనసేనకు కాకినాడ, అనకాపల్లి, నరసాపురం లాంటి రెండు మూడు మినహా మరెక్కడా అవకాశాలు కన్పించడం లేదు.ఒక వేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఈ మూడింటిలో నరసాపురం తప్ప మరెక్కడా టీడీపీ అవకాశం ఇవ్వదు కూడా.అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే, కనీసం కొన్ని పార్లమెంటు స్థానాల్లోనైనా గెలిస్తే ఢిల్లీలో పట్టు దొరుకుతుంది.

కానీ పవన్ ఆ ప్రయత్నమే చేయడం లేదు.ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థ జరిపిన సర్వేలోనూ జనసేనకు ఒక్క సీటు కూడా రాదని తేల్చింది.

టీడీపీకి ఆరు, వైసీపీకి 19 స్థానాలు దక్కుతాయని సర్వే అంచనా వేసింది.సర్వే ఎలా ఉన్నా అస‌లు ప‌వ‌న్ ఆ స్థానాల‌పై ఆలోచిస్తేనే క‌దా.

ఎన్నో వ‌స్తాయ‌ని అనుకోవ‌డం జ‌రుగుతుంది.ఇప్ప‌టికైనా దృష్టి సారించాల‌ని.

అంతేకాకుండా బలమైన ఎంపీ అభ్యర్థులుంటేనే శాసనసభ అభ్యర్థులకు అన్ని రకాలుగా అందడండలు ఉంటాయ‌ని ఆ పార్టీ వ‌ర్గాలే అంటున్న‌ట్లు వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube